-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దోమల వల్ల కలిగే వ్యాధులను నియంత్రించేందుకు, దోమల నియంత్రణ ఎంతో ముఖ్యమైనదని, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ తన పర్యటనలో కనకదుర్గ నగర్, బుడమేరు కాలువలో ఉన్న నీటి పైన ఎంఎల్ ఆయిల్ తో డ్రోన్ ద్వారా స్ప్రే చేయమని అధికారులను ఆదేశించారు.
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, తన పర్యటనలో భాగంగా సర్కిల్ 3 పరిధిలో ఎన్టీఆర్ సర్కిల్, కనకదుర్గ నగర్, గుణదల వద్ద గల మేజర్ ఔట్ ఫాల్ డ్రైన్లను, సర్కిల్ 2 పరిధిలో గల బుడమేరు కాలువను, సర్కిల్ 1 పరిధిలోగల గొల్లపాలెం గట్టు ప్రాంతాలు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ముందుగా సర్కిల్ 3 పరిధిలో ఉన్న ఎన్టీఆర్ సర్కిల్, కనకదుర్గ నగర్ పర్యటించి పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని, ఐలా కార్పొరేషన్ సమన్వయంతో విజయవాడ నగరపాలక సంస్థ హద్దుల్లో కూడా పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా జరగాలని అధికారులను ఆదేశించారు. కనకదుర్గ నగర్ లో డ్రైనలలో సిల్ట్ లను తరచుగా తీస్తూ, దోమల నివారణకు డ్రోన్ ద్వారా ఎం.ఎల్ ఆయిల్ స్ప్రే చేయాలని అధికారులను ఆదేశించారు.
తదుపరి బుడమేరు కాలువ వద్ద డ్రోన్ ద్వారా జరుగుతున్న ఎమ్మెల్యే ఆయిల్ పిచ్కారి విధానాన్ని పరిశీలించారు. ప్రజలకు దోమల వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తరచుగా ఎమెల్ ఆయిల్స్ ప్రే చేస్తుండాలని అధికారులను ఆదేశించారు. తదుపరి గొల్లపాలెం గట్టు వద్ద జరుగుతున్న ప్రతి ఇంటికి కుళాయి నీటి సర్వే ను పరిశీలించారు. సర్వేలో సెక్రటరీలు చేస్తున్న సర్వే విధానం సరిగ్గా చేస్తున్నారా లేదా అని దగ్గరుండి పరిశీలించారు.
ఈ పర్యటనలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతోపాటు చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ పి. రత్నావళి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, బయాలజిస్ట్ సూర్యకుమార్, అసిస్టెంట్ ఇంజనీర్లు, సెక్రటరీలు, తదితరులు పాల్గొన్నారు.