విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సోదర, సోదరీ మణులు అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి పండుగ అని ఐజ గ్రూప్ చైర్మన్ మైనార్టీ నాయకులు షేక్ గయాసుద్దీన్ ఐజ పేర్కొన్నారు. సోమవారం షేక్ గయాసుద్దీన్ ఐజ కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున అభిమానులు, సోదరీమణులు, అక్కా, చెల్లెళ్ళు ఈ వేడుకలో పాల్గొని ఆయనకు రాఖీ కట్టి మిఠాయిలు తినిపించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటా అప్యాయతలు పెంపొందించే పండుగ రాఖీ పండుగ అని తెలిపారు. అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ళ మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగ నిలుస్తుందని తెలిపారు. కుల మతాలతో పట్టింపు లేకుండా రాఖీ పండుగ వేడుక మానవాళిని సోదరమయంగా మారుస్తుందన్నారు. నువ్వు చల్లగా వుండాలంటే రాఖీ కట్టిన ఆడపడుచులకు నీవు అండగా నేనున్నానని అభమివవ్వడమే రాఖీ పండుగ అని అన్నారు. తమ దగ్గరకు వచ్చే సోదరీమణులందరికీ అండగా వుంటానని, మమతానురాగాల బంధమైన రక్షాబంధన్ రోజున అందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు కలగాలని ఆకాక్షించారు.
Tags vijayawada
Check Also
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …