Breaking News

మహిళల భద్రత మనందరి బాధ్యత… : మంత్రి అనిత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళల భద్రత, మనందరి బాధ్యత అని రాష్ట్రం హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. వాసవ్య మహిళా మండలి, లేడీస్‌ సర్కిల్‌, ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌శాఖ, రోటర్‌ క్లబ్‌ ఆఫ్‌ అమరావతితో పాటుగా వివిధ స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం సంఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీ మంగళవారం రాత్రి జరిగింది. బందరురోడ్డులోని డీవీ మానర్‌ దగ్గర మొదలైన కొవ్వొత్తుల ర్యాలీ టిక్కిల్‌ రోడ్డు మీదుగా మదర్‌ థెరీసా జంక్షన్‌, సిద్ధార్థ జంక్షన్‌ వరకు సాగింది. అనంతరం సిద్ధార్థ కళాశాల గ్రౌండ్‌లో సభ జరిగింది. అనిత మాట్లాడుతూ గంజాయిని అరికట్టడంతో పాటుగా మహిళా కళాశాలలు, హాస్టల్స్‌ దగ్గర ప్రత్యేకంగా పోలీసులతో గస్తీని ఏర్పాటు చేసి వారికి రక్షణ కల్పిస్తామని చెప్పారు. వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేఖంగా రూపొందించిన పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ గద్దె అనురాధ, వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్‌ బి.కీర్తి, డాక్టర్‌ పి.దీక్ష, డాక్టర్‌ శ్రీదేవి, డాక్టర్‌ సుదీప్తి వర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *