గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అన్న క్యాంటీన్లకు వచ్చిన వారికి ఆహరం అందలేదని ఫిర్యాదులు రాకుండా, ఎప్పటికప్పుడు డిమాండ్ కు తగిన విధంగా సరఫరా జరిగేలా అక్షయపాత్ర సిబ్బంది అందించాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. బుధవారం చుట్టగుంట సెంటర్ లోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో అన్న క్యాంటీన్లకు పేద ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుందన్నారు. నగరంలోని 7 క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు పూటకు పేదలు రూ.5 కే ఆహారం తింటున్నారన్నారు. క్యాంటీన్లకు వస్తున్న పేదవారికి ఎవ్వరికీ ఆహారం అందలేదని ఫిర్యాదు రాకూడదని, అందుకు తగిన విధంగా ఆహారం సరఫరా జరిగేలా అక్షయపాత్ర సిబ్బంది అందించాలన్నారు. క్యాంటీన్ లో అందించే త్రాగునీటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చుట్టగుంట క్యాంటీన్ లోకి వెళ్లడానికి ముందు ఉన్న డ్రైన్ కి ఇరువైపులా బోర్డ్ లు ఏర్పాటు చేయాలని ఈఈని ఆదేశించారు.
Tags guntur
Check Also
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …