గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఖాళీ స్తలాలకు సంబంధించిన సర్వే సబ్ డివిజన్ సర్టిఫికెట్ల సమస్య శాశ్వత పరిష్కారం కొరకు నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ గారు గుంటూరు జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్ ఐ.ఎ.యస్ గారు, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ శ్రీమతి డి. శైలజ, ఎడి. సర్వే వై.నాగశేఖర్ మరియు నగర పాలక సంస్థ సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్ గార్లతో కలసి బుధవారం సాయంత్రం కమీషనర్ ఛాంబర్ నందు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
సదరు సమావేశంలో నగర పాలక సంస్థ మరియు విలీన గ్రామాలలో గత కొంత కాలంగా ఖాళీల స్తలాలకు సంబంధించిన సబ్ డివిజన్ సర్టిఫికెట్ల మంజూరు విషయంలో నగర ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యల శాశ్వత పరిష్కారం కొరకు క్షుణ్ణంగా సమీక్షించి చర్యలు తీసుకున్నారు. ఇకపై నగర పాలక సంస్థ పరిధిలో మరియు 10 విలీన గ్రామాల పరిధిలోని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కు సంబంధించిన టి.యస్ నెంబర్ మరియు డి నెంబర్ లకు సంబంధించిన ఖాళీ స్థలాలకు నగర పాలక సంస్థ సబ్ డివిజన్ సర్టిఫికెట్లు జారీ చేస్తుందని, యం.ఆర్.ఓ కార్యాలయం రెవిన్యూ విభాగం వారు గుంటూరు నగరంలో మరియు విలీన గ్రామలలోని డి నెంబర్ కలిగిన వ్యవసాయ భూములకు మాత్రం సబ్ డివిజన్ సర్టిఫికెట్లు జారీ చేయుటకు నిర్ణయించడమైనది. అలాగే తాహసీల్దార్ కార్యాలయం నుండి 22A, 22E భూ వివరాలను నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక అధికారులు సేకరించాలన్నారు. ఖాళీ స్తలాల సర్వే కొరకు వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శుల ద్వారా తనిఖీలు నిర్వహించి టౌన్ సర్వేయర్ అప్రూవల్ తో పట్టణ ప్రణాళిక అధికారులు సర్టిఫికెట్లు జారీ చేస్తారన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్ని జిల్లా కలెక్టర్ వారి ఆమోదం అనంతరం సర్టిఫికెట్ల జారీ అమలులోకి వస్తుందన్నారు. నగర పాలక సంస్తలో ఖాళీగ ఉన్న సర్వేయర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు.
సదరు సమావేశంలో ఎ.సి.పి అజయ్ కుమార్, టి.పి.యస్ రసూల్, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …