Breaking News

జెన్ ప్యాక్ట్ లో ఉద్యోగాల కొరకు తయారు చేయబడిన పోస్టర్ ను ఆవిష్కరించిన కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ ఐటీ-మల్టీ నేషనల్ కంపెనీ అయినా జెన్ ప్యాక్ట్ (Genpact) లో ఉద్యోగాల కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జెన్ఫ్యాక్ట్ లో కంటెంట్ మోడర్ణయిజేషన్ మరియు కస్టమర్ సర్వీస్- వాయిస్ సపోర్ట్ ఉద్యోగాల కొరకు తయారు చేయబడిన పోస్టర్ ను తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ఆవిష్కరించారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జెన్ఫ్యాక్ట్ లో కంటెంట్ మోడర్ణయిజేషన్ మరియు కస్టమర్ సర్వీస్- వాయిస్ సపోర్ట్ ఉద్యోగాల కొరకు తయారు చేయబడిన పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడుతూ జిల్లాలోని బీటెక్ ఏ గ్రూప్ అయినా, లేదా ఏదైనా డిగ్రీలో 2022 లేదా 2023 లేదా 2024వ సంవత్సరంలో ఉత్తీర్ణత అయిన యువతీ యువకులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1500 ఖాళీలు ఉన్నాయని, ఉద్యోగం హైదరాబాద్ నందు కల్పించబడుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఇంటర్వ్యూనకు హాజరయ్యే యువతీ యువకులు క్రింద తెలుపబడిన రిజిస్ట్రేషన్ లింక్ లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవలెను అని తిరుపతి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి,ఆర్ లోకనాథం తెలిపారు. మరిన్ని వివరాలకు క్రింద తెలుపబడిన మొబైల్ నెంబర్లను సంప్రదించగలరు.

రిజిస్ట్రేషన్ లింకు: https://bit.ly/46Wzqz6

రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ 28-08-2024.

ఇతర వివరములు కొరకు సంప్రదించండి: 9988853335.

గమనిక: రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి అర్హత అర్హత పరిశీలించి, ఇంటర్వ్యూ జరుగు స్థలము పూర్తి వివరాలను తెలియజేస్తాము. ఈ కార్యక్రమంలో పి.మురళి క్రిష్ణ ఏడిఎస్డి, ఏ.గణేష్,డిపిఓ, దిలీపు మరియు మహేష్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *