-ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
-స్టేడియంను సందర్శించిన ఎమ్మెల్యే బొండా, ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యువత క్రీడల్లో నైపుణ్యం పెంపొందించుకునే విధంగా మాకినేని బసవపున్నయ్య నగర పాలక సంస్థ స్టేడియాన్ని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తో కలిసి సమిష్టిగా అభివృద్ది చేస్తామని ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. అజిత్ సింగ్ నగర్ లోని మాకినేని బసవపున్నయ్య నగర పాలక సంస్థ స్టేడియాన్నిబుధవారం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎంపి కేశినేని శివనాథ్ సందర్శించారు. స్టే డియంలో వర్షం పడినప్పుడు గ్రౌండ్ లో నీళ్లు నిలిచిపోతున్న విషయం చెప్పటంతో పాటు , కొంత మెరక లేపాల్సిన అవసరం వుందని ఎంపి కేశినేని శివనాథ్ కు ఎమ్మెల్యే బొండా వివరించారు. స్టేడియంలో క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకునేందుకు కావాల్సిన విధంగా స్టేడియంను తీర్చిదిద్దటంతోపాటు మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే బొండాతో కలిసి సమిష్టిగా కృషి చేస్తానని ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, 61వ డివిజన్ టిడిపి ప్రెసిడెంట్ దాసరి దుర్గారావు, టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నవనీతం సాంబశివరావు, ఎస్సీసెల్ నియోజకవర్గ కార్యదర్శి బెజ్జం జైపాల్, మైనార్టీ సెల్ నియోజకవర్గ కార్యదర్శి బాషా తదితరులు పాల్గొన్నారు.