-అధికారులకు ఆదేశాలు ఇచ్చిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రోడ్ల పైన వర్షపు నీటిని నిలువలు లేకుండా ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉంటూ నిరంతరం చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అధికారులను ఆదేశించారు. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం సాయంత్రం వన్ టౌన్, కెనాల్ రోడ్ ప్రాంతాలన్నీ పర్యటించి పరిశీలించారు. రోడ్ల పైన వర్షపు నీటి నిలువలు లేకుండా చూసుకోవాలని, ప్రజలకు ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా వెంటనే రోడ్లపై ఉన్న వర్షపు నీటి నిల్వలను తొలగించాలని. నిరంతరం సైడ్ డ్రైనలలో పూడికలు తీస్తూ వర్షపు నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకుంటూ అక్కడ ఉన్న రోడ్లపైన ఎటువంటి వర్షపు నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతోపాటు చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ పి. రత్నావళి, చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ శ్రీరామచంద్రమూర్తి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ ఎస్ ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.