-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయి సర్వేలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని అసెస్మెంట్లకు సర్వే జరుగుతున్న సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, గురువారం నాడు ప్రతి ఇంటికి కుళాయి సర్వేను సత్వరమే పూర్తి చేసి నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జరుగుతున్న ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయి సర్వే లో భాగంగా సచివాలయం సెక్రటరీలు ప్రతి ఇంటికి వెళ్లి చేస్తున్న త్రాగునీటి కుళాయి సర్వే ను వేగవంతం చేయాలని, సర్వేలో ఎటువంటి ఉడుదుడుకులు లేకుండా ఖచ్చితమైన నివేదికను నమోదు చేయాలని, విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 233131 అసెస్మెంట్లకు గాను గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు 186638 అసెస్మెంట్ల సర్వే పూర్తయిందని, దాదాపు 80 శాతం సర్వే ని పూర్తి చేశారని, ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయి100% సర్వేను సత్వరమే పూర్తి చేసి నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సర్కిల్లో ప్రతి ఇంటికి కూడా ఈ సర్వే ను వేగవంతంగా నిర్వహించేటట్టు జోనల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలని, రెవెన్యూ, ఇంజనీరింగ్, అధికారుల సహకారంతో సత్వరమే ప్రతి ఇంటి కి త్రాగునీటి కులాయి సర్వేను పూర్తి చేసి నివేదికన సమర్పించాలని కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు.
Prajavartha Online Telugu News