Breaking News

విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని సందర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర

-అసమానతలను ఎదుర్కొంటూ రాణిస్తున్న ఆర్ఐఎన్ఎల్ కలెక్టివ్స్ శక్తికి అభినందనలు

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గనులు & భూగర్భ శాస్త్రం మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఆర్ఐఎన్ఎల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అతుల్ భట్ సిఎండి, ఆర్ఐఎన్ఎల్ మరియు డైరెక్టర్లు మరియు ఇతర సీనియర్ అధికారులతో సంభాషించారు. విశాఖపట్నం ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాలుకు సంబంధించిన వివిధ అంశాలను వీరు చర్చించారు. తర్వాత ప్లాంట్ సందర్శన సందర్భంగా మంత్రి ఈడీ వర్క్స్ బిల్డింగ్ మరియు బ్లాస్ట్ ఫర్నేస్-3లోని నమూనా గదిని సందర్శించి కార్మికులతో కాసేపు సంభాషించారు. సవాళ్లను అధిగమిస్తూ ప్లాంట్లను నిర్వహించడంలో ఆర్ఐఎన్ఎల్ కలెక్టివ్ చేస్తున్న కృషిని అభినందించారు. అలాగే భవిష్యత్తులో వారందరూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రితో పాటూ గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, బండారు సత్యనారాయణ మూర్తి, ఎమ్మెల్యే మాడుగుల, సీనియర్ రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *