-ఉపాధిహామీ పనులపై అవగాహన తోపాటు గృహ, గ్రామాల్లో కనీస సౌకర్యాలపై, రోడ్ కనెక్టివిటీ తదితర అంశాలపై చర్చించాలి
-స్వర్ణ గ్రామంగా తయారవడానికి గ్రామ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని అన్ని గ్రామ పంచాయితీలలో ఈనెల 23న (నేడు)ఒకే రోజు నిర్వహించే గ్రామ సభలను విజయవతంగా నిర్వహించాలని, ప్రతి గ్రామ సభకు ఒక ప్రత్యేక అధికారిని నియమించామని, సదరు గ్రామ సభలో స్వర్ణ గ్రామంగా తయారవడానికి గ్రామ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని, పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు.
గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని మండలాల తాసిల్దార్లు , ఎంపిడిఓ లు, మండల అధికారులు, ఆర్డీఓ లు, మునిసిపల్ కమిషనర్లు తదితరులతో సమీక్షిస్తూ కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధిహామీ పై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు గ్రామాల్లో విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్, ఒక గ్రామం నుండి మరో గ్రామానికి, గ్రామం నుండి మండలాన్ని కలిపే అనుసంధానం చేసే రహదార్లు నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఘణ, ద్రవ వ్యర్దాల నిర్వహణ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించి విజన్ డాక్యుమెంట్ తయారు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అందరు ప్రజా ప్రతినిధులు ఈగ్రామ సభల్లో పాల్గొనేలా చూడాలని అన్నారు. గ్రామ సభల నిర్వహణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయ వంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల సర్వతో ముఖాభివృద్ధికి దోహదపడే రీతిలో ఈగ్రామ సభలను విజయంతంగా నిర్వహించాలని అన్నారు. గ్రామ సభల నిర్వహణకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలను తూచా తప్పక పాటించాలని అన్నారు. ముఖ్యంగా ఉపాధిహామీ పధకం అమలుకు సంబంధించి మంజూరైన పనులు, కొత్త పనుల గుర్తింపు, సామాజిక తనిఖీపై గ్రామ సభల ద్వారా ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాలని చెప్పారు. అంతేగాక గ్రామాల్లో నూరు శాతం కనీస సేవలు కల్పించడం, ఫామ్ పాండ్ల నిర్మాణం, ఉద్యానవన, పట్టు పరిశ్రమలకు తోడ్పాటు అందించడం, పశు షెడ్ల నిర్మాణం వంటి వాటిపై కూడా చర్చించి వాటి కల్పనపై దృష్టి సారించాలని అన్నారు. ఇందులో ప్రతి గృహానికి కనీస అవసరాలు కొళాయి కనెక్షన్, గ్యాస్, మరుగుదొడ్లు, గ్రామ అవసరాలు, రోడ్ కనెక్టివిటీ, విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నరేగా అంశాలపై చర్చించాలని, దీని ద్వారా గ్రామ విజన్ డాక్యుమెంట్ తయారు అవుతుందని తెలిపారు. మొదటగా ప్రతి ఇంటికి కనీస వసతులైన రక్షిత మంచినీటి కొళాయి కనెక్షన్, ఎల్ పి జి గ్యాస్, కరెంట్ కనెక్షన్, మరుగుదొడ్లు ఉండేలా, రెండవ అంశం గ్రామానికి సంబంధించి డ్రైనేజీ, వీధి దీపాలు, సిమెంట్ రోడ్లు , సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏర్పాటు ఉండేలా మూడవ అంశం ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంతర్గత రోడ్లు, ఆసుపత్రి, పాఠశాల ఏర్పాటు, ఫారం పాండ్లు, పశువులకు షెడ్, పశు సంపద, ఉద్యాన వన పంటల సాగు, నాలుగవ అంశంగా సమీప గ్రామాలకు కనెక్టివిటీ, ఐదవ అంశంగా నరేగా కింద చేపట్టనున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు వంటి అంశాలు గ్రామ సభలో చర్చించాలి. ప్రతి గ్రామాన్ని స్వర్ణ గ్రామంగా మార్చేందుకు ప్రతిపాదనలు గ్రామ సభలో చర్చించి ప్రణాలికలు ఆమోదించాలనీ, తదనుగుణంగా సదరు ఫోటోలు, గ్రామ సభల రిజల్యూషన్లను సంబంధిత వెబ్సైట్ నందు అప్లోడ్ చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా పంచాయితీ అధికారిణి సుశీల దేవి, డిప్యూటీ సిఈఓ ఆది శేషా రెడ్డి, పీ డి డ్వామా శ్రీనివాస ప్రసాద్, డి ఎం హెచ్ ఓ శ్రీహరి, ఆర్డీఓ లు నిషాంత్ రెడ్డి, కిరణ్ కుమార్, రవి శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.