-బంగారం అభరణాలపై1 గ్రాముకు 300తగ్గింపు
-వజ్రాభరణాలపై ఒక క్యారెట్ కు 15000 వరకు తగ్గింపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నమ్మకం…. నాణ్యత . నైపుణ్యత కు పేరుగాంచిన మొహమ్మద్ ఖాన్ డైమండ్ & జ్యూయలర్స్ నూతన షో రూమ్ గురువారం నగరంలోని రాఘవయ్య పార్కు ఎదురుగల యం జి రోడ్డు నందు ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మొహమ్మద్ ఖాన్ డైమండ్, జ్యూయలర్స్ మేనేజింగ్ పార్టనర్ ఇర్ఫాన్ ఖాన్ మాట్లాడుతూ ప్రారంభం అఫర్ ను కోనుగోలు దారులకు అందిస్తున్నట్లు తెలిపారు. బంగారు ఆభరణాల పై ఒక గ్రాము కు 300 రూపాయలు,వజ్రాభరణాలపై 15000 వరకు తగ్గిపు కు ధరలకు అందజేస్తున్నట్లు ఆయన చెప్పారు. అత్యంత నాణ్యత ప్రమాణాలతో బంగారు, వజ్రాభరణాలను వినియోగదారులకు అందజేస్తున్నట్లు వెల్లడించారు.బంగారు ఆభరణాలను లైట్ వెయిట్ ప్రత్యేకంగా తయారు చేయించి వినియోగదారులకు అందుబాటులో ఉంచి నట్లు తెలిపారు. అనేక రకాల అధునాతమైన డిజైన్లు కొనుగోలుదారుల కోసం తీసుకువచ్చినట్లు తెలిపారు. బంగారు,వజ్రాభరణాలతో పాటుగా వెండి ఆభరణాలను విక్రయిస్తున్నట్లుచెప్పారు. ఈ కార్యక్రమంలో లోమొహమ్మద్ ఖాన్ డైమండ్, జ్యూయలర్స్ పార్టనర్ ఫజలుల్లా రహమాన్ ఖాన్, కె ఏం మునీరుద్దీన్, మేనేజర్ బి. ఎల్.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.