-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ క్రీడా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలని, అంతర్జాతీయ, జాతీయ పోటీల్లో రాణించిన క్రీడాకారులను అభినందించి మరిన్ని పతకాలు సాధించాలని అన్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆర్టిస్టిక్ పోటీల్లో ఎన్నో పతకాలను సాధించిన చైత్రదీపిక, దియాశ్రీ లను విజయవాడ మునిసిపల్ కమీషనర్ ధ్యానచంద్ర, శనివారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో అభినందించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఎన్ఎస్ఎం స్కూల్లో 9వ తరగతి చదువుతున్న చైత్రదీపిక ఇటీవల పొల్లాచి (కోయంబత్తూరు) లో ఆగస్టు 7 నుండి 11 వరకు జరిగిన 2వ ఇండియా స్కేట్ గేమ్స్,2024 లో 14 -17 age గ్రూప్ లో ఆర్టిస్టిక్ స్కేటింగ్ లో మూడు పతకాలు-సోలో డాన్స్ (రజతం), ఫ్రీ స్కేటింగ్ (రజతం) మరియు క్వార్టెట్ (కాంస్యం) సాధించింది మరియు 59th,60th,61st రోలరు స్కేటింగ్ నేషనల్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకుంది మరియు గతేడాది బిజినింగ్ చైనా లో జరిగిన 19th ఆసియన్ రోలరు స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటిలులో పసిడి పతకాలు సాధించగా కమిషనర్ ధ్యానచంద్ర అభినందించారు. ఈ సంవత్సరం కూడా అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని అన్నారు. అలాగే 11 -14 age గ్రూప్ లో దియాశ్రీ-పెయిర్ స్కేట్లో (కాంస్యం) మరియు సోలో డాన్స్ (రజతం) పతకాలు సాధించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విజయవాడ మునిసిపల్ కమీషనర్ గారిని వారి కార్యాలయంలో చైత్ర శనివారం మర్యాదపూర్వకంగా కలవగా కమిషనర్ ధ్యానచంద్ర అభినందనలు తెలిపి,
రానున్న రోజుల్లో మరిన్ని అంతర్జాతీయ పతకాలు సాధించి దేశానికి, రాష్ట్రని కు, జిల్లా కు మరియు విజయవాడ క్రీడా ఖ్యాతిని ప్రపంచానికి చాటాలని మునిసిపల్ కమీషనర్ ఆమెకు సూచించారు.