విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆగస్టు 25,26 మరియు 27 తారీకుల్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించబోతున్నాము అని తెలియ చేయుటకు చాలా ఆనందిస్తున్నాము. ఈ ఉత్సవాలను ఆగస్టు 25,26 తారీకుల్లో కృష్ణ లంక లోని స్క్రూ బ్రిడ్జి వద్ద ఉన్న ఇస్కాన్ సిటీ సెంటర్ శ్రీ శ్రీ జగన్నాథ్ మందిరం వద్ద నిర్వహిస్తున్నాము. మరియు 26,27తారీకుల్లో ఉండవల్లి, అమరావతి కరకట్ట రోడ్డు వద్ద ఉన్న శ్రీ శ్రీ రాధా శ్యాంసుందర్ మందిరంలో నిర్వహించనున్నాము.
జగన్నాథ్ మందిరంలో జరిగే జన్మాష్టమి ఉత్సవ వివరాలు
25వ తేదీన శ్రీ శ్రీ జగన్నాథ్ మందిరమున సుమారు రెండు వేల కిలోల పుష్పలతో స్వామివారికి మహా పుష్పాభిషేకం, పంచామృతాలతో కలశాభిషేకముతో పాటు జిల్లా స్థాయిలో ఉట్టి మహోత్సవము జరపబడును, మరియు
స్వామి వారికి 108 రకాల నైవేద్యాలు సమర్పించ బడుతాయి. మరియు 26వ తేదీ న స్వామివారికి మహాశంఖాభిషేకము, ప్రత్యేకమైన కీర్తనలు, ధూపదీప నైవేద్యాల సమర్పణ మరియు అనేక రకములైన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు 7 సంవత్సరాల లోపు పిల్లలకు లిటిల్ కృష్ణ కాంపిటీషన్స్,ఉట్టి మహోత్సవ పోటీలు నిర్వహించబడును. విజేతలకు బహుమతి ప్రదానం గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) చేస్తారు.
ఉండవల్లిలోని శ్రీ రాధా శ్యామ సుందరుల మందిరములో జరిగే కార్యక్రమాల వివరాలు
26వ తేదీ మహా శంఖాబిషేకము, ఉట్టి మహోత్సవము, శ్రీ శ్రీ రాధా శ్యామ్ సుందర్ వారిప్రత్యేకమైన దివ్య దర్శనము తో పాటు ధూప దీప నైవేద్యాలతో స్వామివారి అర్చన, ప్రత్యేకమైన కీర్తనలు మరియు మహా హారతులు జరుపబడును.
27 వ తేదీన ఉదయం 9 గంటల నుండి నందోత్సవం మరియు ఇస్కాన్ సంస్థాపకచార్యులు శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి 128వ జన్మోత్సవ వేడుకలు జరుపబడును. శ్రీల ప్రభుపాదుల వారి 128వ జన్మోత్సవం సందర్భంగా వారికి నూతన సింహాసనాన్ని బహుకరించబోతున్నాము.
గత నెలలో మూడు రోజులపాటు నిర్వహించిన శ్రీ జగన్నాథ్ రథోత్సవం మాదిరిగానే శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు కూడా అంతే భారీగా స్థాయిలో చేయబోతున్నాము. ఇందులో వివిధ పాఠశాల మరియు కళాశాల విద్యార్థుల మధ్య, డాన్స్ కాంపిటేషన్స్, సింగింగ్ కాంపిటీషన్స్, ఫాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ మరియు జిల్లా స్థాయిలో ఉట్టి మహోత్సవ పోటీలు నిర్వహించనున్నాము. వేలమంది విద్యార్థులు ఇందులో పాల్గొనబోతున్నారు, కార్యక్రమ అనంతరం పోటీలలో గెలిచిన విజేతలకు బహుమతి ప్రధానోత్సవం జరుగుతుంది.
ఈ కృష్ణ జన్మాష్టమి ఉత్సవాలలో విజయవాడ నగరవాసులు అందరూ పాల్గొని శ్రీ శ్రీ జగన్నాథ్ మరియు శ్రీ శ్రీ రాధా శ్యాంసుందరుల విశేషమైన కృపా కటాక్షాలు పొందవలసిందిగా శ్రీమాన్ చక్రధారి ప్రభు నగర ప్రజలందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నారు .
3 రోజలు పాటు జరిగే ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులకు ప్రసాద వితరణ జరుగుతుందని శ్రీమాన్ చక్రాధారి దాస్ తెలియ చేసారు. ఈ సమావేశంలో మందిర సీనియర్ మాంక్ శ్రీమాన్ వ్రజదాందాస్, మందిర కమాండర్ శ్రీమాన్ బలరాం గోవింద దాస్ తదితరులు పాల్గొన్నారు.