Breaking News

నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జెన్పాక్ట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణ జిల్లా – జెన్పాక్ట్ కంపెనీలో ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఎస్ శ్రీనివాసరావు మరియు ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు సంయుక్తంగా తెలియజేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జెన్పాక్ట్ ఎంఎన్సి కంపెనీలో కంటెంట్ మోడరేషన్,కస్టమర్ సర్వీస్ వాయిస్ సపోర్ట్ విభాగాలలో 1500 ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివద్ధి సంస్థ ద్వారా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.ఈ ఉద్యోగాలకు 2022, 2023, 2024 సంవత్సరాల్లో ఏదైనా డిగ్రీ, బీటెక్ పాసైన అభ్యర్థులు అర్హులు. ఈ ఉద్యోగాలఎంపిక ప్రక్రియలో హెచ్ఎర్, టెక్నికల్ రౌండ్లు ఉంటాయని తెలిపారు.ఈ ఉద్యోగాలు హైదరాబాద్ లోని హఫీజ్ పేట లో రొటేషన్ షిఫ్టుల్లో ఉంటాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 28 ఆగస్టు 2024 లోపు తమ దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే వారు, వెంటనే https://bit.ly/46Wzqz6 లింక్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీ, స్థలాన్ని తర్వాత తెలియజేయడం జరుగుతుందని మరింత సమాచారం కోసం 99888 53335 నంబర్ ను సంప్రదించగలరని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *