విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా సోమవారం స్థానిక రామవరప్పాడు లో యామనేని రామస్వామి వీధిలో 22 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యాదవ సంఘం అధ్యక్షులు కొంగన రవికుమార్ మాట్లాడుతూ ఈ ఉత్సవాలు 21 సంవత్సరాలు నుంచి చేస్తున్నామని, రామవరప్పాడు, యామనేని రామస్వామి వీధిలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి స్థానిక పెద్దలు, సంఘ నాయకులు ఎంతో కృషి చేశారని వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నారని ఆయన అన్నారు. కార్యక్రమములో ముఖ్య అతిథులను పెద్దలను, నాయకులను మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు తదితర నాయకులు విచ్చేసి స్వామిని, దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్లారని ఆయన చెప్పారు. ఈరోజు సాయంత్రం ఉట్టు కొట్టు ఉత్సవ కార్యక్రమం జరుగుతుందని అని తెలిపారు.
తదనంతరం వక్తలు, యాదవ సంఘం నాయకులు మాట్లాడుతూ కృష్ణ జన్మాష్టమి వేడుకలు 22వ వార్షికోత్సవం ఇంత ఘనంగా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఆ శ్రీకృష్ణుడు ప్రజలకు భోగభాగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని , మనస్ఫూర్తిగా కోరుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మెండే వెంకటేష్, తుపాకుల స్వామి, సుంకర కోటేశ్వరరావు, కృష్ణం వెంకట సుబ్బారావు, యాదవ సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధిక సంఖ్యలో భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …