Breaking News

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా 9వ వార్షికోత్సవ వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీశ్రీశ్రీ చిన్ని కృష్ణుని భక్త బృందం, పడాల నాగు & ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సోమవారం స్థానిక విశాలాంధ్ర సెంటర్ నందు 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు పడాల నాగు మీడియాతో మాట్లాడుతూ గత 8 సంవత్సరాల నుండి దిన దిన ప్రవర్ధమానం అవుతూ ఇప్పుడు 9 సంవ్సతరం ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుతున్నామని, సుమారు ఈ సంవత్సరం వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించామని అలాగే ఈరోజు సాయంత్రం పుట్టుకొట్టే ఉత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, నాయకులు, నగర ప్రముఖులు, యాదవ సంఘం నాయకులు, స్థానికులు, స్థానిక పెద్దలు, అభిమానులు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *