విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హెచ్.ఐ.వి/ఎయిడ్స్/యస్.టి.ఐ నివారణను ప్రోత్సహించడం కోసం రొండు నెలల అవహాగన, చికిత్సలో బాగంగా ఈ నెల 31న బి.ఆర్.టి.యస్ రోడ్డునందు రెడ్ 5కె మారధాన్ ను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎయిడ్స్ నియంత్రణా అధికారిని డాక్టర్ జి.ఉషారాణి ఒక ప్రకటణలో తెలిపారు. కళాశాలలో చదువుతున్న 17 నుండి 25 సంవత్సరాల వయస్సు ఉన్న యువతీ యువకులు ఈ మారధాన్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మారధాన్ మూడు విభాగాలలో అనగా ఆడ, మగ మరియు ట్రాన్స్ జండర్ ల వారీగా జరుగుతాయని, ఈ మూడు విభాగాలలో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా ఏడు వేల రూపాయలను, రొండవ బహుమతిగా నాలుగు వేల రూపాయలతో పాటుగా ప్రశంసా పత్రాన్ని ఇవ్వడం జరుగుతుందని కావున కళాశాల విధ్యార్థినీ విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆమె తెలిపారు. ఇతర వివరాల కొరకు 8341580048, 9440004730 నంబర్లను సంప్రదించాలని ఆమె తెలియజేశారు.