గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో మెరుగైన పారిశుధ్య పనులు జరిగేందుకు వార్డ్ సచివాలయాల వారీగా ప్రజారోగ్య కార్మికుల రేషనలైజేషన్ ని పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఎంహెచ్ఓ ని ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో ప్రజారోగ్య విభాగ శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, వెహికిల్ షెడ్ ఇంజినీరింగ్ అధికారులతో నగరంలో పారిశుధ్య పనుల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర ప్రజల ఆరోగ్య రక్షణలో పారిశుధ్య విభాగం కీలకమన్నారు. అటువంటి ప్రజారోగ్య విభాగంలో ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పని చేయాలన్నారు. నగరంలో వార్డ్ సచివాలయాల వారీగా ప్రజారోగ్య కార్మికులు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ, మరి కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉన్నారని, వీరందరినీ రేషనలైజేషన్ చేస్తే మెరుగైన పారిశుధ్యం వీలవుతుందన్నారు. శానిటేషన్ కార్యదర్శులు తమ సచివాలయం పరిధిలో నివాసిత గృహాలు, కమర్షియల్ సంస్థలు, ప్రధాన, అంతర్గత రోడ్ల, డ్రైన్ల పొడవు, జనాభా వంటి వివరాలు ఇవ్వాలని, అందుకు తగిన విధంగా కార్మికుల కేటాయింపు చేయాలన్నారు. ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ప్రధాన రహదారులు స్వీపింగ్ యంత్రాల ద్వారా శుభ్రం చేయాలని, ట్రాక్టర్లు, కాంపాక్టర్లు వంటి వాహనాల మరమత్తులు ఎట్టి పరిస్థితుల్లోను 2 రోజులకు మించి ఉండడానికి వీలులేదన్నారు. ఈ-ఆటోలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి స్వచ్చాంధ్ర కార్పోరేషన్, ఆటోల కంపెనీ ప్రతినిధుల నగరపాలక సంస్థ ఇంజీనిరింగ్ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు.
సమావేశంలో ఎంహెచ్ఓ మధుసూదన్, ఈఈ కొండారెడ్డి, డిఈఈ సతీష్, శానిటరీ సూపర్వైజర్లు రాంబాబు, సోమశేఖర్, ఆయూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …