Breaking News

39 వ జాతీయ నేత్ర దాన పక్షోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ : డా.ఎస్.వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహించనున్న సందర్భంగా నేటి మంగళవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ సచివాలయం లో నేత్రదాన పక్షోత్సవాల పోస్టర్ ను జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేలా చూడాలని, నేత్రదానం చేసి అంధులకు చూపు ఇవ్వాలని కోరారు. మరణానంతరం మీ కళ్ళు నశించిపోకుండా, ఇద్దరు కార్నియా అంధులకు చూపును ప్రసాదించాలని కోరారు. నేత్రదానాన్ని పవిత్రమైన బాధ్యతగా పాటిద్దాం అన్నారు. మరణించిన వ్యక్తి సమాచారాన్ని ఆరు గంటల లోపల సమీపంలోని కంటి సేకరణ కేంద్రానికి ఇస్తే వైద్య సిబ్బంది వచ్చి నేత్రాలను సేకరిస్తారని తెలిపారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా అంధత్వ నివారణ అధికారిని డాక్టర్ మధుబాబు మాట్లాడుతూ జాతీయ నేత్రదానం పక్షోత్సవాల సందర్భంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు విద్యాసంస్థల్లో విద్యార్థులకు చైతన్యం తీసుకువచ్చేలా కృషి చేస్తున్నామని, ప్రజల మూఢనమ్మకాలు వదిలి నేత్రదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిపిఎమ్ఓ డాక్టర్ శ్రీనివాసులు, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రూప్ కుమార్, ఎస్ వి ఆర్ ఆర్ జి జి హెచ్ ఆప్తాల్మజీ, హెచ్ఓడి చలపతి రెడ్డి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *