Breaking News

రానున్న మార్చి నాటికి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం…

-కుదప వద్ద శరవేగంగా జరుగుతున్న కృష్ణా జలాల ప్రాజెక్టు పనులు..
-ఎ.కొండూరుతో పాటు మరో మూడు మండలాలలో నీటి శాంపిళ్లను పరీక్షిస్తాం..
-అవసరమైన అన్ని ఆవాసాలకూ సురక్షిత కృష్ణా జలాలను సరఫరా చేస్తాం..
-వ్యాధి ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం..
-వ్యాధి బారిన పడిన వారికి పూర్తి వైద్య సహాయం అందిస్తాం..
-జిల్లా కలెక్టర్‌ డా. జి.సృజన

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎ.కొండూరు పరిసర ప్రాంతాల గ్రామాలకు సురక్షిత కృష్ణా జలాలను అందించేందుకు రూ.50 కోట్లతో వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, రానున్న మార్చి నాటికి పూర్తి స్థాయిలో త్రాగునీటిని సరఫరా చేసి కిడ్నీ వ్యాధి నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్‌ డా. జి.సృజన తెలిపారు.
ఎ. కొండూరు పరిసర ప్రాంతాలలో కిడ్నీ వ్యాధిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 50 కోట్ల రూపాయలతో రెడ్డిగూడెం మండలం కుదప వద్ద జరుగుతున్న రక్షిత త్రాగునీటి రిజర్వాయర్‌ నిర్మాణ పనులను, బుధవారం జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. రెడ్డిగూడెం మండలం కుదప గ్రామం వద్ద జరుగుతున్న రక్షిత తాగునీటి పథక నిర్మాణం పనులను పరిశీలించడంతోపాటు ఏ కొండూరు మండలంలోని డీప్లానగర్‌ తండాలో పర్యటించి తండావాసులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ఏ కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను, మందులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ డా. జి. సృజన ఎ. కొండూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కుదప వద్ద నిర్మాణం జరుగుతున్న ఓవర్‌ హెడ్‌ రిజర్వాయర్‌ పనులను పరిశీలించి యుద్ద ప్రాతిపదికన గడువుకు ముందే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఓవర్‌ హెడ్‌ రిజర్వాయర్‌ పనులు తుది దశకు చేరుకోగా 200 కి లో మీటర్ల మేర పైపులైన్ల పనులలో ఇప్పటికే 30 కి.లో మీటర్లు పూర్తి కాగా మరో 70 కి.లో మీటర్ల పనులు చివరి దశలో ఉన్నాయని ఆర్‌డబ్యుఎస్‌ ఎస్‌ ఇ డి.వి. రమణ కలెక్టర్‌కు వివరించారు. సంప్‌ నుంచి కృష్ణా జలాలను శుద్ధి చేసి ఓవర్‌ హెడ్‌ రిజర్వాయర్‌కు పంపింగ్‌ చేస్తామని అక్కడ నుండి ఎ. కొండూరు మండలంలోని 38 కిడ్ని ప్రభావిత గ్రామాలు, తండాలకు పైపులైన్లు, డిస్ట్రిబ్యూషన్‌ పైపులైన్ల ద్వారా శుద్ది చేసిన నీటిని సరఫరా చేయడం జరుగుతుందని విలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన్నట్లు కలెక్టర్‌ తెలిపారు. దశాబ్ద కాలం నుండి ఎ.కొండూరు మండలోని గ్రామలతో పాటు సమీప గ్రామలలో ప్రజలు కిడ్నీ వ్యాధితో బాదపడుతున్నట్లు తెలిపారు. దీనికి కారణం ఆయా ప్రాంతాలలో భూగర్భ జలాల్లో లోహ మూలకాల శాతం ఎక్కువగా ఉండటం వలనని, నీటి పరీక్షలలో వెల్లడైనదని అన్నారు. ఈ ప్రాంత ప్రజలు భూగర్భ జలాలను తాగడానికి ఆరోగ్యానికి హనికరమనే ఉద్దేశంతో ప్రభుత్వం సురక్షిత కృష్ణా జలాలను అందించడమే సమస్యకు శాశ్వత పరిష్కారంగా భావించి 50 కోట్ల రూపాయల నిధులతో త్రాగునీటి ప్రాజెక్టును చేపట్టడం జరిగిందన్నారు. ఎ.కొండూరు మండలంలోని 38 ఆవాసాలకు పైపు లైన్‌ ద్వారా రక్షిత మంచినీటిని అందించాలన్న బృహత్తర కార్యక్రమాని ్న రానున్న మార్చి నాటికి పూర్తి చేసి నీటిని సరఫరా చేయనున్నట్లు ఆమె తెలిపారు. అప్పటి వరకు 38 ఆవాసాల పరిధిలో 56 పాయింట్ల లో ఏర్పాటు చేసిన తాత్కాలిక సింటెక్స్‌ ట్యాంకుల ఏర్పాటు చేయడం జరిగిందని, ట్యాంకర్ల ద్వారా గ్రామాలకు కృష్ణా జలాలను ట్యాంకులలో నింపి ప్రజలకు అందిస్తున్నామన్నారు. ట్యాంకులలో కృష్ణాజలాలు నింపడంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి పాయింట్‌ వద్ద స్థానిక గ్రామస్థులతో కమిటీని ఏర్పాటు చేసి నీటి సరఫరాని పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పరిసర మండలాల్లోనూ పరీక్షలు చేస్తాం..
ఎ.కొండూరు మండలంతో పాటు సమీప రెడ్డిగూడెం, గంపలగూడెం, తిరువూరు మండలాలోని గ్రామాల్లో కూడా భూగర్భ జలాల నమూనాలను పరీక్షించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే గంపలగూడెం మండలంలోని రెండు ఆవాసాల్లో నీటిని పరీక్షించగా తాగేందుకు సురక్షితం కాదని తెలిందన్నారు. నాలుగు మండలాల పరిధిలో విస్తృతంగా పరీక్షలు నిర్వహించి, ఫలితాల ఆధారంగా ఏయే గ్రామాలకు సురక్షిత కృష్ణా జలాలను అందించాలో ఆ గ్రామాలన్నింటికీ కుళాయిల ద్వారా నీటిని అందించనున్నట్లు తెలిపారు. వచ్చే మే, జూన్‌ నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని, ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే సురక్షిత తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు సమగ్ర సర్వే:
కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారిని పూర్తిస్థాయిలో గుర్తించేందుకు ఎ.కొండూరు, గంపలగూడెం, రెడ్డిగూడెం, తిరువూరు మండలాల్లో సమగ్ర సర్వే నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. వ్యాధి ప్రమాదకరంగా మారకుండా అవసరమైన మందులతో పాటు వైద్య సేవల పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎ.కొండూరు పీహెచ్‌సీ పరిధిలో దాదాపు 216 మంది క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌ (సీకేడీ)తో బాధపడుతున్నారని, వీరిలో 25 మందికి డయాలసిస్‌ సేవలు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన అన్ని వైద్య సేవలను అందించాలని వైద్య అధికారులను ఆదేశించామని కలెక్టర్‌ సృజన తెలిపారు. డీప్లా నగర్‌ తండా వాసులతో కలెక్టర్‌ ముఖాముఖి:
ట్యాంకర్ల త్వారా సరఫరా చేస్తున్న సురక్షిత శుద్ది చేసిన త్రాగునీటిని మాత్రమే వినియోగించాలని, అవసరమైతే కాచిచల్లార్చిన నీటిని వినియోగించుకుని ఆనారోగ్య సమస్యలు తలెత్త కుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ తండా వాసులకు సూచించారు.
పర్యటనలో కలెక్టర్‌ వెంట తిరువూరు ఆర్‌డీవో కె.మాధవి, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ డీవీ రమణ, ఇన్‌చార్జ్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, డ్వామా పిడి జె. సునీత డిపివో శ్రీనివాస్‌ యాదవ్‌ కృష్ణారావు పాలెం గ్రామ సర్పంచ్‌ పి. నాగమల్లేశ్వరి, ఇన్‌చార్జ్‌ యంపిడివో శ్రీ కృష్ణ పరమాత్మ, వివిధ శాఖల అధికారులు స్థానిక నాయకులు ఉన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *