-జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన చూపిన జిల్లా క్రీడాకారులు ఎందరికో స్ఫూర్తి
-కలెక్టరేట్లో జరిగిన సన్మాన కార్యక్రమం లో పాల్గొన్న కలెక్టర్ ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
క్రీడల్లో ప్రతిభ చూపి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన విద్యార్థులు యువ క్రీడాకారులు అభినందనీయులని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడాకారులను సన్మానించారు.
జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న సన్మాన గ్రహీతలు :
జాతీయస్థాయిలో ట్యాక్వాండో 73 కేజీల విభాగంలో వెండి పతకం గుబ్బల మేరీ గోల్డ్
జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ 73 కేజీల విభాగంలో బంగారు పతకం నల్ల ప్రజ్ఞ
సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్ లో పాల్గొన్న గౌతమ్
జాతీయ బ్యాంకింగ్ బ్యాట్మెంటన్ టోర్నమెంట్లో అండర్ 13 విభాగంలో పాల్గొన్న వెంకట చైతన్య
46 వ జాతీయస్థాయి ఇండియన్ మాస్టర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో పాల్గొన్న డి రుద్ర కుమార్
జాతీయ జూనియర్ మహిళల 97 కేజీల క్ బాక్సింగ్ లో బంగారు పతకం సాధించిన కే దివ్యశ్రీ
అంతర్జాతీయ మానస్ ఇండో బాంగ్లా ఫ్రెండ్షిప్ కప్ 2023 వీల్ చైర్ క్రికెట్ టీం టీ 20 ఆటో లో పాల్గొన్న ఎం ప్రవీణ్ కుమార్.
3 వ జాతీయ కరాటే మరియు కుంగ్ ఫు ఛాంపియన్షిప్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన వివి కిరణ్మయి.
67వ జాతీయ స్కూల్ గేమ్స్ 23-24 అండర్ 19 విభాగంలో బాక్సింగ్ లో పాల్గొన్న జి అక్షిత.
2 వ ఎన్ వై ఎస్ ఎఫ్ జాతీయ యోగ పోటీలలో పాల్గొని గిన్నిస్ రికార్డ్ సాధించిన వి సాత్విక లను కలెక్టర్ సన్మానించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, కె ఆర్ ఆర్ సి ఎస్డీటి ఆర్ కృష్ణ నాయక్, జిల్లా క్రీడా అధికారి డివివి శేషగిరి , డి టి డబ్ల్యూ ఓ కే ఎన్ జ్యోతి, కోచ్ లు ఎన్ ఎం దాస్, బీ వి జి నాగేంద్రన్, క్రీడా కారులు , శిక్షకులు, తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.