రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆగష్టు 31 వ తేదీ శనివారం ఉదయం “వికాస” ఆధ్వర్యంలో తూర్పు గోదావరీ జిల్లా కలెక్టరేట్ లో “జాబ్ మేళా” నిర్వహిస్తున్నట్లు వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కే.లచ్చారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళలో అపోలో ఫార్మసీ లో ఫార్మసిస్ట్ , ముతూట్ ఫైనాన్స్ లో బ్రాంచ్ ఎగ్జిక్యూటివ్, ప్రోబషనరీ పోస్టులకు,ఐడిఇఫ్ లో క్యాడ్ డిజైనర్, ఇండో ఎంఐఎం కంపెనీలో టెక్నిషియన్,రేపుటెడ్ కంపెనీలో, కెమిస్ట్, ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యోగాలకు ఎస్.ఎస్.సి, ఇంటర్, ఐ.టి.ఐ, డిప్లొమో, & డిగ్రీ, బిటెక్ ఉత్తీర్ణులైన 30 సంవత్సరాల లోపు అభ్యర్థులు అర్హులు. వీరి అర్హత మేరకు నెలకు రూ.10,000/- నుండి రూ. 25,000/ వరకు జీతం మరియు ఇన్సింటివ్స్, భోజనం, వసతి & రవాణా సౌకర్యం ఆయా ఉద్యోగాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులందరూ ఈనెల 31వ తేదీ శనివారం “వికాస కార్యాలయం, కలెక్టరేట్ (బొమ్మూరు హార్లీక్స్ ఫ్యాక్టరీ ఎదురుగా) రాజమహేంద్రవరం” వద్ద ఉదయం 9.30 గంలకు విద్యా అర్హతల సర్టిఫికెట్స్ జెరాక్స్ ల తో నేరుగా హాజరుకావలెనని తెలిపారు. మరిన్ని వివరాలకు www.vikasajobs.com లేదా ఫోన్ నంబర్ 7660823903 ను సంప్రదించాలని తెలిపారు.
Tags rajamandri
Check Also
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …