-సెప్టెంబర్ 2 నుంచి సూళ్లూరుపేట డివిజన్లో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్విమ్స్, శ్రీ బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ ఆధ్వర్యంలో గురువారం పెళ్లకూరు పిహెచ్ సి పరిధిలోని నెలబల్లి, పుల్లూరు సచివాలయాల్లో ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో రెండు పింక్ బస్సుల ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతోంది. ఇందులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ రెండు క్యాంపుల్లో విశేషంగా ప్రజలు విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో పెళ్లకూరు పిహెచ్ సి మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ ఎస్.సుజాత, డాక్టర్ ఉమ, స్విమ్స్ శ్రీ బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ చైతన్య భాను, డాక్టర్ హరిత, సర్పంచులు శ్రీనివాసులురెడ్డి, రాంబాబు, కమలమ్మ, పంచాయతీ కార్యదర్శి మధుమోహన్, నర్సింగ్ సిబ్బంది, స్థానిక వైద్య సిబ్బంది, ఎంల్ హెచ్ పిలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 2 నుంచి సూళ్లూరుపేట డివిజన్లో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్
చెంబేడు పిహెచ్ సి పరిధిలో…
– సెప్టెంబర్ 2న తాళ్వాయిపాడు.
– సెప్టెంబర్ 4న కానూరు.
– సెప్టెంబర్ 6న బంగారంపేట.
దొరవారిసత్రం పిహెచ్ సి పరిధిలో…
– సెప్టెంబర్ 9న పూలతోట.
– సెప్టెంబర్ 11న తనియాలి.
– సెప్టెంబర్ 13న ఉచ్చూరు.
– సెప్టెంబర్ 18న నెలబల్లి.
– సెప్టెంబర్ 20న కొత్తపల్లి.
– సెప్టెంబర్ 23న పోలిరెడ్డిపాడు
– సెప్టెంబర్ 25న యెకొళ్ళు.
– సెప్టెంబర్ 27న వేనుంబాక.
తొగరమూడి పిహెచ్ సి పరిధిలో…
– సెప్టెంబర్ 30న కల్లూరు.