నిజాయితితో కులగణన అమలు చేసి బీసీలకు న్యాయం చెయ్యాలి

-ఎన్నికలే అజెండాగా కులగణనపై ఆరెస్సెస్ ప్రకటన : రిటైర్డ్ డీజీపీ, ఏపీ కోఆర్డినేటర్ డా పూర్ణచంద్ర రావు
-BSP రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉన్నట్టుండి కులగణనకు మేము సముఖంగా ఉన్నాము అని ఆరెస్సెస్ చెప్పటం విడ్డూరమైన విషయం, ఇది కేవలం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన ప్రకటనలా ఉంది, అని రిటైర్డ్ DGP, బీఎస్పీ ఏపీ కోఆర్డినేటర్ డా పూర్ణచంద్ర రావు అభిప్రాయపడ్డారు.

“ఇవాళ ఆరెస్సెస్ ఈ ప్రకటన ఎందుకు చేసింది. వచ్చే రెండు మూడు నెలల్లో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయనా? మరి ఇదే ఆరెస్సెస్ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి చెప్పి కులగణన అమలుకు కార్యాచారణ ప్రకటించేలా చేయచ్చు కదా”

“కులగణన డేటా కేవలం సంక్షేమం కోసం అంటున్నారు వీళ్ళు. మరి రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా, బడుగు, బలహీన అణగారిన వర్గాలకు సంక్షేమం సమర్థవంతంగా ఎలా అమలు చేయగలరు. ఇక్కడే వీరి నిబద్ధత తేటతెల్లం అవుతోంది.”

“ఆంధ్రప్రదేశ్ లో వారి కూటమి సర్కారుపై కులగణనపై వస్తున్న ఒత్తిడి కూడా రేపు వారిని ఇరకాటంలో పెడుతుంది, గడచిన కొద్దీ నెలలుగా మేము బీఎస్పీ తరపున ఆంధ్రప్రదేశ్ లో కులగణనపై మా పోరాటం అంచెలంచెలుగా తీవ్రతరం చేస్తూ పోతున్నాము. అందుకే అటు ఎన్నికల కోసం, ఇటు కేంద్రంలో ఎన్డీయే సర్కారును కాపాడుకోవటానికి చేసిన ప్రకటన మాత్రమే.”

ఈ సందర్భంగా మాట్లాడుతూ, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి ఇలా అన్నారు: “కులగణనను రాజకీయంగా వాడుకోవద్దట. అసలు కులగణనపై పోరాడేదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల రాజకీయ ప్రాతినిధ్యం, ప్రాముఖ్యత కోసం, ఇందులో రాజకీయాన్ని ఎవరు వెతుకుంటున్నారు. గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడుముకున్నట్టు రాజాకీయపరంగా దీన్ని చూస్తుంది బీజేపీ మాత్రమే, కాంగెస్ కూడా ఇందులో తోడు దొంగే.”

“ఎప్పుడు కులగణన గురించి మాట్లాడినా, హిందువుల ఐక్యత అని మతంలోనే చిచ్చుపెట్టే విధంగా రాజకీయ ప్రకటనలు చేస్తుంది బిజెపియే. అందుకే బీఎస్పీ తరపున మేము బీజేపీ, ఆరెసెస్లను సవాలు చేస్తున్నాము, ప్రకటనలు కాదు, కార్యాచరణతో రండి”

“కాంగ్రెస్ 7 దశాబ్దాలుగా అధికారంలో ఉండి కులగణన కోసం చేసే డిమాండ్ కూడా బూటకమే. ఆంధ్ర, ఢిల్లీ ప్రభుత్వాలు తక్షణం సకల కులగణన చేపట్టాలి. లేకపోతే ప్రజాగ్రహాన్ని ఎదుర్కొoటారు.”

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *