Breaking News

మహిళా విభాగం ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహారం పంపిణీ

-ఒక్కరోజులో 20 వేల మందికి ఆహారం అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల కురిసిన వర్షాలకు గాను నీట మునిగిన వరద బాధితులకు మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండలంలో పలు గ్రామాలలో వాటర్ బాటిల్ మరియు భోజనాన్ని పంపిణీ చేశారు. టాటా ఏసీ ద్వారా ట్రక్కు టెర్మినల్ వరద బాధితులకు ఏర్పాటుచేసిన శిబిరాల వద్దకు వెళ్లి ఆహారాన్ని అందించారు. అనంతరం కొండపల్లి శాంతినగర్ కొత్త ఉన్న సూర్య పబ్లిక్ స్కూల్ శిబిరంలో ఆహారాన్ని అందించారు. ఇబ్రహీంపట్నంలోని రోడ్డుపై ఉంటున్న వరద బాధితులకు నేరుగా వారి వద్దకు వెళ్లి ఆహారాన్ని అందించారు. ప్రభుత్వం ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదనే విధంగా పనిచేస్తుందని, ఈ క్రమంలోనే మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలు ముందుకు వచ్చి తమవంతుగా బాధితులకు తమ చేతనైన సహాయాన్ని అందించే క్రమంలో నేరుగా వరద బాధితుల ఉన్న ప్రదేశానికి వెళ్లి ఆహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో 22వ కౌన్సిలర్ అమ్మాజీ, రాజ్యలక్ష్మి, శ్రావణి, లక్ష్మీ కుమారి, రాజ్యలక్ష్మి, సంపూర్ణ, దుర్గ, సౌజన్య, దీపక్, తేజ, లావణ్య , సుజాత పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *