Breaking News

అధిక ధరలపై ఈనెల 6న సిపిఐ తలపెట్టిన ధర్నాలు వాయిదా

-వరద బాధితుల సహాయార్థం నిధి వస్తువులు సేకరించాలని పార్టీ శ్రేణులకు పిలుపు
 సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అధిక ధరలు తగ్గించాలని కోరుతూ ఈనెల ఆరవ తేదీన భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలను వరదల కారణంగా వాయిదా వేయడమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. వరద బీభత్సం లక్షలాది మందికి కన్నీళ్లు మిగిల్చింది. అందువల్ల అధిక ధరలను తగ్గించాలని కోరుతూ ఈనెల 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద చేపట్టిన ధర్నాల కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ వాయిదా వేయటమైంది. అందుకు బదులుగా పార్టీ శ్రేణులు వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని సిపిఐ రాష్ట్ర సమితి విజ్ఞప్తి చేస్తున్నది. వరద బాధితుల సహాయార్థం నిధి, నిత్యవసరాలు, వంట సామాగ్రి తదితర వస్తువులను వసూలు చేయాలని సిపిఐ శ్రేణులకు పిలుపునిస్తున్నది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *