అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణానది వరదల నేపథ్యంలో ఉపాధ్యాయులు తమ గురుతర బాధ్యత నిర్వర్తించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. అవనిగడ్డలో తన స్వగృహంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల ఎంఈఓలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ నాయకులు, కార్పొరేట్ స్కూల్స్ ప్రతినిధులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదలకు లంక గ్రామాల ప్రజలు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో నిలిచారన్నారు. వారిని ఉదారంగా ఆదుకుని లంకల్లో ప్రజలు సాధారణ స్థితికి చేరుకునే స్థాయిలో ఉపాధ్యాయులు స్పందించి తోడ్పాటు ఇవ్వాలని కోరారు. పెద్దఎత్తున విరాళాలు సేకరించి నియోజకవర్గ వరద బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, ఎంఈఓలు టీవీఎం రాందాస్, జీ.వీ.ఎన్ గోపాల్, శివశంకర్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బీ.కనకారావు, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వీ.సాంబశివరావు, డీ.పీ.ఆర్.టీ.యూ జిల్లా అధ్యక్షులు జీవీఎస్ ఆంజనేయులు, ప్రవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, కార్పొరేట్ విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News