Breaking News

5 సహాయ శిబిరాలను సందర్శన

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
నిడదవోలు మండలం పరిధిలోని తిమ్మరాజుపాలెం, రావిమెట్ల, కంసాలిపాలెం, సింగరాజుపాలెం మరియు తాళ్లపాలెంలో కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాల మేరకు ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా ఏర్పాటు చేసిన 5 సహాయ శిబిరాలను సందర్శించడం జరిగిందని మండల ప్రత్యేక అధికారి, జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి ఏ. దుర్గేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఆయా పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. నందమూరు అక్విడెక్ట్ వద్ద ప్రస్తుతం నీటి మట్టం 29.2 అడుగులు చేరిందని, ప్రస్తుతం ఎటువంటి ప్రమాద తీవ్రత లేదని ఆయన తెలియ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *