Breaking News

ఈ నెల 17న జాతీయ నులిపురుగుల నిర్మూలన రెండవ విడత కార్యక్రమం

-పిల్లలు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఎదగడం కోసం నులి పురుగుల నిర్మూలన కొరకు ఆల్బెండజోల్ చప్పరించే మాత్రలను తప్పనిసరిగా వాడాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్.వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పిల్లలు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఎదగడం కోసం నులి పురుగుల నిర్మూలన కొరకు ఆల్బెండజోల్ చప్పరించే మాత్రలను తప్పనిసరిగా వాడాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ సూచించారు. సోమవారం స్థానిక జిల్లా సచివాలయంలో జిల్లా కలెక్టర్ గారు వైద్య ఆరోగ్య శాఖ వారి నులిపురుగుల నిర్మూలన ఆవశ్యకత పై పోస్టర్ ను ఆవిష్కరించి అధికారులకు పలు సూచనలు చేశారు.

పిల్లలు నులిపురుగుల బారిన పడడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం , వారి ఎదుగుదల మీద తీవ్రమైన ప్రభావం చూపుతాయని దీనివల్ల పోషకాహార లోపం ఏర్పడుతుందని, అంతే కాకుండా రక్తహీనత ఆకలి లేకపోవడం అలసట కడుపునొప్పి వికారం, బరువు తగ్గడం వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని అన్నారు. ఇలాంటి పరిస్థితులను పిల్లలకు దూరం చేసి నులిపురుగులను నిర్మూలించి మంచి ఆరోగ్యంగా ఉండేందుకు ఆల్బెండజోల్ చప్పరించే మాత్రలు తప్పనిసరిగా ఉపయోగించాలని అధికారులకు సూచించారు. ప్రతి సంవత్సరం రెండు విడతలలో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం జరుపుకుంటామని, మొదటి విడత పూర్తయిందని, సెప్టెంబర్ 17వ తేదీ నుంచి జరగనున్న 2వ విడత జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో 1 – 19 సంవత్సరముల మధ్య గల అన్ని అంగన్వాడి, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లోని పిల్లలకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ చేయాలని వైద్య సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. మాప్ అప్ సెప్టెంబర్ 25 న ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరి,ప్రోగ్రాం అధికారిణి ఆర్బీఎస్కే పద్మావతి, డిఈఓ శేఖర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి జయలక్ష్మి, డిసిహెచ్ఎస్ ఆనంద రావు, జిల్లా ఎపిడమాలజిస్ట్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *