-ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే బొండాతో కలిసి నిత్యావసరాలు పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద బాధితులను ఆర్థికంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక సాయం ప్రకటిస్తారని ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గం 61వ డివిజన్ పాయకాపురంలోని శాంతి నగర్ లో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకల కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తో కలిసి ఎంపి కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. వరద బాధితులకి ఎమ్మెల్యే బొండా తో కలిసి నిత్యావసర సరుకల కిట్లు పంపిణీ చేశారు.
అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ గత ఎనిమిది రోజులుగా ఎమ్మెల్యే బొండా ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గంలో వరద బాధితులను ఆదుకునేందుకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడన్నారు. అలాగే వరద కారణంగా ప్రతి ఇంట్లో పాడైన టివిలు, ఫ్రిడ్జ్ లు, వాషింగ్ మెషిన్స్ రిపేర్ చేయించేందుకు కావాల్సిన ఏర్పాట్లు ప్రభుత్వ సహకారంతో ఎమ్మెల్యే బొండా ఆధ్వర్యంలో జరుగుతున్నాయన్నారు. వరద బాధితులకి మరింత సాయం అందించేందుకు రేపటి నుంచి దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నగరంతో పాటు, నగర ప్రజల్ని కూడా సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
అలాగే బాధితుల్ని ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖ కంపెనీలు ముందుకి రావాలని పిలుపు నిచ్చారు. శాంతినగర్ లో నిత్యావసర సరుకుల కిట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంక్ అధికారులను అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు వదర బాధితులకి ముమ్మరంగా సహాయ చర్యలు అందిస్తున్నారన్నారు. బాధితులందరికీ సాయం అందుతుందని..ఎవరు కంగారుపడొద్దన్నారు. ప్రతి ఇంటికి బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ సి.వి.ఎన్. భాస్కర రావు, డిప్యూటీ జనరల్ మేనేజర్ శారద మూర్తి, విజయవాడ రీజనల్ హెడ్ మువ్వల శ్రీధర్, టిడిపి నాయకులు దాసరి దుర్గారావు, దాసరి కనకరావు, ఆకుల సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News