పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని, జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ జిల్లా అధికారుల నుఆదేశించారు సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది”ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా అమ్మడుగురు మండలంలో కస సముద్రంలో గ్రామ సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్ గా పని చేయుచున్న ప్రభాకర్ 2.3.2022 వ తేదీన రోడ్డు ప్రమాదంలో గాయపడి మెదడు జబ్బుతో బాధపడుతూ ప్రస్తుతం కోమస్థితిలో ఉన్నాడు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ప్రత్యేక వాహనములో తీసుకువచ్చారు. కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ స్వయంగా అతనిని పరిశీలించారు. అతనికి ఒక కుమార్తె, ఒక బాబు చిన్నపిల్లల గా ఉన్నారువారి భార్య భాగ్యమ్మకు ఉద్యోగ భద్రత కల్పిస్తానని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. కమిటీ సభ్యుల ఆమోదంతో ఆమెకు త్వరలో ఉద్యోగ భద్రత కల్పించడం జరుగుతుందని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ శుభ దాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ మంజువాణి, డి సి హెచ్ ఓ తిపేంద్ర నాయక్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News