అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి: విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఏపీ ఐఏఎస్ అధికారులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందించారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి విరాళానికి సంబంధించిన పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆర్.పి. సిసోడియా, బుడితి రాజశేఖర్, సాయి ప్రసాద్, కృష్ణబాబు, విజయానంద్, వీరపాండ్యన్, సృజన తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News