అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 37,421 చ.కి.మీ. సుసంపన్నమైన అటవీ సంపద ఉంది. శ్రీగంధం, ఎర్ర చందనం లాంటివి విలువైన వృక్ష జాతులు… అద్భుతమయిన వన్య ప్రాణులు మన అడవుల్లో ఉన్నాయి. అమూల్యమైన ఈ సహజ సంపదను అవిశ్రాంతంగా పరిరక్షించడంలో అంకిత భావంతో కూడిన మన రాష్ట్ర అటవీ సిబ్బంది ముందంజలో ఉన్నారు. ఈ వనరులను కాపాడుకునే క్రమంలో, మా ధైర్యవంతులైన సిబ్బందిలో కొందరు ప్రాణ త్యాగం చేశారు. ఖేజ్రీ చెట్లను రక్షించడానికి బిష్ణోయ్ తెగవారు చేసిన చారిత్రాత్మక త్యాగాన్ని స్మరించుకొంటూ సెప్టెంబర్ 11న జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంగా గుర్తించారు. మన అటవీ వనరుల రక్షణలో తమ ప్రాణాలను అర్పించిన అటవీ శాఖ సిబ్బందికి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తున్నాను. వారి త్యాగాలు స్మరణీయమైనవి. మన అడవులను, వన్యప్రాణులను భవిష్యత్ తరాలకు సంరక్షించే కీలకమైన కర్తవ్యాన్ని కొనసాగించడానికి వారి ధైర్యం మరియు నిబద్ధత మనందరికీ ఎల్లప్పుడూ ప్రేరణగా ఉపయోగపడుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
Prajavartha Online Telugu News