Breaking News

వరద బాధితులకు డాక్టర్ తరుణ్ కాకాని ఆపన్న హస్తం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే డాక్టర్ తరుణ్ కాకాని ఇటీవల సంభవించిన వరదల్లో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి ఎబిసి అమరావతి బోటింగ్ క్లబ్ తరపున సిఈఒ, బిజెపి నాయకులు, సామాజికవేత్త డాక్టర్ తరుణ్ కాకాని, ఎండి కె.పవిత్ర దంపతులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 1,00,116 విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన డాక్టర్ తరుణ్ కాకాని, పవిత్ర కొండ్రెడ్డి లను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందజేయడమే కాకుండా, ప్రజారోగ్య సంరక్షణ కోసం తాము నిరంతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో తమ ఎబిసి అమరావతి బోటింగ్ క్లబ్ ముందుంటుందని.. ఆహార పంపిణీ, గ్రంథాలయ, పాఠశాలల నవీకరణ తదితర సహాయ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాము అండగా నిలుస్తామని, వరద కారణంగా నష్టపోయిన తమ సిబ్బందికి అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తామని వెల్లడించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *