Breaking News

శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న హిమాన్షు శుక్ల

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
రెండు రోజుల తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం విచ్చేసిన రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్ల మరియు కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కృతిక శుక్ల వారు కుటుంబ సమేతంగా నేటి ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. ముందుగా వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శించుకున్నారు. నిన్నటి రోజున శ్రీకాళహస్తీశ్వరస్వామి వారిని వారు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య వీరి వెంట ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *