గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
డ్రైన్ల పై, రోడ్ల మీద ఆక్రమణల వలన ట్రాఫిక్ సమస్యతో పాటుగా మురుగు పారుదల లేక తీవ్ర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆక్రమణల తొలగింపుకు ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేశామని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. గుంటూరు తూర్పు ఎంఎల్ఏ మహ్మద్ నసీర్, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి గురువారం లాలాపేట మెయిన్ రోడ్, పట్నం బజార్ ల్లో రోడ్, డ్రైన్ల ఆక్రమణ తొలగింపు పరిశీలించి, స్థానిక వ్యాపారులతో ఆక్రమణల తొలగింపుపై అవగాహన కల్గించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో డ్రైన్ల పై ఆక్రమణల వలన వ్యర్ధాలు అడ్డుపడి వర్షం నీరు రోడ్ల మీదకు, ఇళ్లల్లోకి వెళ్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆయా ప్రాంతాల్లో నిలిచిన నీటిని బెయిల్ అవుట్ చేయడానికి కూడా డ్రైన్ లో పారుదల లేక సాధ్యం కావడంలేదన్నారు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా డ్రైన్ల పై ఆక్రమణలను సహించబోమన్నారు. ఇప్పటికే నగరంలో ఐటిసి ఎదురు జిటి రోడ్, ఓల్డ్ క్లబ్ రోడ్ ల్లో డ్రైన్ల పై ఆక్రమణలను తొలగించండం జరిగిందని, రాబోవు కాలంలో నగరంలోని అన్ని ప్రాంతాల్లో డ్రైన్ల ఆక్రమణలను తొలగిస్తామన్నారు. తూర్పు నియోజకవర్గ ఎంఎల్ఏ గారు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆక్రమణదారులకు ముందుగా అవగాహన కల్గించి, వారినందరినీ సహకరించేలా కృషి చేయడం అభినందనీయమన్నారు.
ఎంఎల్ఏ నసీర్ గారు మాట్లాడుతూ వర్షం, మురుగు నీరు వెళ్లడానికి వీలు లేకుండా డ్రైన్ల పై ఆక్రమణలు జరిగితే నీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతారన్నారు. పట్నం బజార్ లో పలువురు ముందుకు వచ్చి ఆక్రమణల తొలగింపుకు సహకరించడం సంతోషంగా ఉందన్నారు. రోడ్ కి ఇరువైపులా ఉన్న దుకాణదార్లు తప్పనిసరిగా దుకాణం ముందు రోడ్ మీదకు తమ సరుకులు పెట్టుకోవడానికి వీలులేదన్నారు. త్వరలో పట్నంబజార్ రోడ్ లో ట్రాఫిక్ సమస్య పరిష్కారంతో పాటుగా ప్యాచ్ వర్క్ లు చేపట్టడం జరుగుతుందన్నారు.
అనంతరం పూల మార్కెట్ నుండి కన్యకా పరమేశ్వరి దేవాలయం వరకు చేపట్టిన బిటి రోడ్ నిర్మాణ పనులకు కమిషనర్, ఎంఎల్ఏ, కార్పొరేటర్లు, అధికారులు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఈ. శ్యాం సుందర్, ఎంహెచ్ఓలు మధుసూదన్, రామారావు, కార్పొరేటర్లు ఖాజా మొహిద్దీన్ చిస్టి షేక్, సంకూరి శ్రీనివాసరావు, ఈరంటి వర ప్రసాద్, ఈఈ కోటేశ్వరరావు, డిసిపి శ్రీనివాసరావు, టిపిఎస్ సువర్ణ కుమార్, డిఈఈ శ్రీధర్, ఎస్ఎస్ రాంబాబు, ఏఈ సునీల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ మనోహర్ బాబు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …