– జేసీ చిన్న రాముడు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
2024-25 ఖరీఫ్ సీజన్ ప్యాడి సేకరణపై జిల్లాలో అమలు చేసే విధానం పై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ లో సమగ్ర కార్యాచరణ వివరించడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. గురువారం జెసి ఛాంబర్ లో సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, గత రెండు సీజన్లలో జిల్లాలో ధాన్యం సేకరణ సమయంలో తీసుకున్న నిర్ణయాలను, అమలు చేసిన ప్రణాళికల విషయంలో ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నామని తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో అక్టోబర్ నెలాఖరు నుంచి జిల్లాలో పకడ్బందీగా ధాన్యం సేకరణ చేపట్ట వలసి ఉన్న దృష్ట్యా ఖచ్చితమైన విధి విధానాలు రూపొందించడం, వాటిని నిబద్ధతతో అమలు చేసేందుకు చొరవ చూపాలని ఆదేశించారు. రైతు సేవా కేంద్రాలు, ఇతర కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నందు అధికారులు తెలియ చేసే సూచనలు స్వీకరించడం, వాటిని అంతే నిబద్ధత తో కలిసి అమలు చేసేందుకు సిద్దంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డి ఎమ్ సివిల్ సప్లై టి.రాధిక, డిఎస్వో పి. విజయ భాస్కర్, రవాణా, లీగల్ మేట్రాలజి, సహకార, రెవెన్యు , పోలీసు, ఇతర సమన్వయ శాఖల అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.