Breaking News

ఈ-డ్రిస్ట్రిక్ట్ మేనేజర్ పోస్ట్ భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానం

-దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ అక్టోబర్ 2
-కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా కలక్టరు కార్యాలయం నందు ఈ-డ్రిస్ట్రిక్ట్ మేనేజర్ పోస్ట్ భర్తీ చేయుటకు ఈ దిగువ పేర్కొన్న అర్హతలు కలిగిన, ఆసక్తీ ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. 31.08.2024 వ తేదీ నాటికి 21 నుండి 35 సంవత్సరముల వయస్సు కలిగి, విద్యార్హతలు గా బిసిఏ / బీఎస్సీ / బి ఇ / బి టెక్ / మాస్టర్స్ డిగ్రీ పాసయి ఉండి, ఐ టి సెక్టార్ లో రెండు సంవత్సరముల అనుభవం కలిగిన వారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. ది.23.09.2024 వ తేదీ ఉదయం గం.11.00 ల నుండి ది 02.10.2024 వ తేదీ సాయంత్రం గం.05.00 ల లోపున ఆహ్వానించడమైనది. నోటిఫికేషన్ మరియు దరఖాస్తు నమూనా https://eg.ap.gov.in వెబ్ సైట్ నందు పొందుపరచడం జరిగిందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *