-గరిష్టంగా ఒక కళాశాల నుంచి 4 నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం
-స్ధానిక నన్నయ్య యూనివర్సిటీ ఎన్టీయార్ కన్వెన్షన్ లో పోటీలకి ఏర్పాటు
-కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ పర్యాటక దినోత్సవం -2024 పురస్కరించుకుని పర్యటక అంశంపై తూర్పుగోదావరి జిల్లా స్థాయి పోటీలను సెప్టెంబరు 27 న నన్నయ్య యూనివర్సిటీ క్యాంపస్ ఆవరణలోని ఎన్టీఆర్ కాన్వెన్షన్ సెంటర్ నందు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగు అంశాలలో(కేటగిరి లలో) ఈ పోటీలను నిర్వహిస్తామని, వకృత్వ, క్విజ్, వీడియో రీల్, ఫోటోగ్రాఫి విభాగాలలో ఆసక్తి ఉన్న ఓత్సాహిక యువతి , యువకులు పాల్గొని వారిలోని సృజనాత్మకత ప్రదర్శించేందుకు ఇదీ చక్కటి అవకాశం అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పర్యటక ప్రదేశాల ప్రశస్తి తెలియ చేసేందుకు వక్తృత్వం, క్విజ్, ఒక నిమిషం వీడియో /15′ TO 30′ రీల్, ఫోటోగ్రఫీ కేటగిరి పోటీలలో పాల్గొని ప్రతిభను చాటుకునేందుకు చక్కటి అవకాశం అని పేర్కొన్నారు.
సెప్టెంబరు 27 వ తేదీ ఉ. 9.00 గం” నుండి ఎన్టీఆర్ కన్వెన్షన్ హాల్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ కాంపస్, రాజానగరం (రాజమహేంద్రవరం) లో పర్యాటకం మరియు శాంతి, సుస్థిర ప్రయాణాలు, కలకాలం జ్ఞాపకాలు అంశం పై ఆంగ్లం లేదా తెలుగులో పాల్గొనవచ్చునని తెలియ చేశారు. కానీ వీటి రెండిటినీ ఒకే కేటగిరీ కింద పరిగణిస్తామన్నారు. ప్రదర్శన కు సంబంధించి 5 నిమిషముల కాల వ్యవధి ఇవ్వబడుతుందని, ఉదయం 9.00 గంటలకు నన్నయ్య యూనివర్సిటీ ఎన్టీఆర్ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద రిపోర్ట్ చేయవలసి వుంటుందన్నారు. పర్యాటకం – (ఏపీ ఇండియా ప్రపంచ) పై ఒక నిమిషం వీడియో అంశము /15′ TO 30′ రీల్ అంశము – పర్యాటకం, తూర్పుగోదావరి జిల్లా “వీడియో/రీల్‌లో కవర్ చేయబడే మతపరమైన పర్యాటక & ప్రధాన పర్యాటక గమ్యస్థానాలు” అంశం పై ఏ 4 షీట్ లో వివరాలు భౌతికంగా అందజేయాలన్నారు. వీడియో క్లిప్స్ HD quality కలిగిన soft copy edrjy@aptdc.in లేదా apta@ap.gov.in) లకు మెయిల్ చేయవలెనని కలెక్టర్ తెలిపారు. ప్రతి కేటగిరీ నుండి ఒక నామినేషన్ చొప్పున ఒక కాలేజీ నుండి నాలుగు గరిష్టంగా నామినేషన్లు మాత్రమే అంగీకరించ బడుతాయని, ఆ విధంగా కళాశాలలు ముందుగాని షార్ట్ లిస్టింగ్ చేసుకొని విద్యార్థులను పంపవలెనని పర్యటక శాఖ ప్రాంతీయ సంచాలకులు వి. స్వామీ నాయుడు కోరారు. పోటీల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు మద్యాహ్నం 2 గం” నుండి సాయంత్రం 4 గం” వరకు నిర్వహిస్తామని తెలిపారు.
మరింత సమాచారం కొరకు కళాశాల యాజమాన్యాలు ఈదిగువ పేర్కొన్న వారిని సంప్రదించాలని తెలియజేశారు
ప్రొఫె. ఎన్. ఉదయ భాస్కర్, HoD, DCMS, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం: 9182301625.
పి. వెంకటాచలం. జిల్లా పర్యాటక అధికారి: 6309942025.
బి.అన్వర్ హుస్సేన్, సీనియర్ అసిస్టెంట్, టూరిజం: 9121725757.
కె. సురేష్ కుమార్, జూనియర్ అకౌంటెంట్, టూరిజం: 7036530828.
Prajavartha Online Telugu News