-CEIR /CHAT BOT పోర్టల్ల ద్వారా పోగొట్టుకున్న/ దొంగిలించ బడిన మొబైల్ ఫోన్లను రికవరి చేసిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు
-రికవరీ ఫోన్లను బాధితులకు అందించిన నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.
-అనంతరం కంట్రోల్ రూం, కమాండ్ కంట్రోల్ రూమ్ లను పరిశీలించిన సి.పి.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు మొబైల్ ఫోన్ రికవరీ డ్రైవ్ లో భాగంగా రికవరి చేసిన 400 మొబైల్ ఫోన్లను ఈ రోజు కమాండ్ కంట్రోల్ నందు పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ఫిర్యాదు దారులకు అందజేయడం జరిగింది. ఈ మూడవ విడత రికవరీ ఫోన్ల విలువ సుమారుగా రూ. 50 లక్షలు ఉండవచ్చు.
CEIR (Central Equipment Identity Register)/ CHATBOT పోర్టల్ల ద్వారా ప్రజల వద్ద నుండి దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరుగుతోంది. ఫిర్యాదు దారులు తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు, పోలీసులకు ఫిర్యాదు చేస్తే, పోలీసులు IMEI నెంబర్లు మరియు అడ్రస్ ప్రూఫ్ లను CEIR పోర్టల్ లో నమోదు చేస్తారు. దీని తర్వాత, ఫిర్యాదుదారులకు ఒక అంకలెడ్జ్మెంట్ నెంబర్ ఇస్తారు. TSP (Telecom Service Provider) వారు ఈ IMEI నెంబర్లను బ్లాక్ చేసి, ప్రస్తుతం ఆ ఫోన్ ను ఎవరు వాడుతున్నారో వారి వివరాలను పోలీసులకు అందిస్తారు. ఇలా రికవరీ అయిన మొబైల్ ఫోన్లను తిరిగి IMEI నెంబర్‌ను అన్‌బ్లాక్ చేసి ఫిర్యాదు దారులకు అందజేస్తారు.
ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ…ముంధుగా సైబర్ క్రైమ్ అధికారులను మరియు సిబ్బందిని అభినందించారు. తమిళనాడు, తెలంగాణ, కేరళా ఇతర రాష్ట్రాలకు రికవరీ చేయడం జరిగింది. అందరి ఐ.ఎం.ఈ లను సర్వీస్ ప్రోవైడర్లకు పంపించడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు అద్భుతమైన టెక్నాలజీ తయారు చేసింది. చాట్ బాట్ ద్వారా కొన్ని ఫోన్లను రికవరి చేయడం జరిగింది. సైబర్ క్రైమ్ సిటిజన్ యాప్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని అనేక కార్యక్రమాలు చేపట్టాము.ఇప్పటి వరకు 18000 మంది వరకు సైబర్ సిటిజన్ యాప్ ద్వారా అవగాహన కల్పించడం జరిగింది. మరో రెండు, మూడు నెలల్లో నాలుగు లక్షల మంది సైబర్ సిటిజన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు చేపట్టడం జరుగుతుంది. క్యూ ఆర్ కోడ్ ద్వారా ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. అందరూ ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. 1930 ని ప్రజలోకి తీసుకువెళ్లాలి. పోలీస్ వేషాధారణలో కాల్ చేసి కొంతమంది పోలీసుల మని బెదిరిస్తూ మీ ఫోన్ హ్యాక్ చేసి డబ్బులు కాజేస్తారు. అలాంటి వాటిని నమ్మవద్దు. ఒకరు అలాగే 1.7 కోట్ల నగదును పోగొట్టుకున్నారు. మీరు 1930కి కాల్ చేస్తే ఆయా అకౌంట్ లను ఫ్రీజ్ చేయడం జరుగుతుంది.
మీరు వెళ్లి మరో 10మందికి సైబర్ సిటిజన్ యాప్ పై అవగాహన కల్పించాలి. బీ సైబర్ సిటిజన్ క్యాంపెన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కాలంలో మొబైల్ మన జీవితంలో చాలా ముఖ్యం అయ్యింది. కావున ఈ మొబైల్ రికవరీ మీకు స్వాంతన కలిగిస్తుందని తెలియజేసారు. ఇప్పటి వరకు ఎన్.టి.ఆర్.జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం 1,785 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి, ప్రజలకు తిరిగి అందజేయడం జరిగింది. మొదటి విడతగా 307 మొబైల్ ఫోన్లు, రెండవ విడతగా 628 మొబైల్ ఫోన్లు రికవరీ చేయబడ్డాయి అని తెలియజేసినారు. కాబట్టి, ప్రజలు CEIR /CHAT BOT పోర్టల్ల సేవలను వినియోగించుకొని, తమ పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి పొందాలని పోలీస్ శాఖ సూచించింది. దీనిలో భాగంగా కంట్రోల్ రూం, కమాండ్ కంట్రోల్ రూమ్ లను పరిశీలించారు.
ఈ క్రమంలో సి.సి.కెమెరాల పనితీరును, ట్రాఫిక్ కంజెక్షన్ కోసం ఏర్పాటు చేయు ప్రత్యేకమైన సి.సి.కెమెరాలను పరిశీలించి దీనిమీద ఏ విధంగా చర్యలు తీసుకుంటే ప్రయాణికులు తక్కువ టైం లో గమ్యాలకు చేరుకుంటారు అనే విషయంపై అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. కామాండ్ కంట్రోల్ లోని సిబ్బంది పనితీరును గమనించి ఇంకా మెరుగైన సేవలను అందించే విధంగా తగిన సూచనలు చేశారు. అదేవిధంగా డైల్ 100, 112 కాల్స్ లకు త్వరితగతిన స్పందించి అతి తక్కువ సమయంలో కాల్స్ చేసినవారి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటూ న్యాయం జరిగేలా చూడాలని సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ తోపాటు డి.సి.పి. గౌతమి షాలి ఐ.పి.ఎస్, ఏ.డి.సి.పి. జి.రామ కృష్ణ, ఎం.రాజారావు, సైబర్ క్రైమ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News