Breaking News

దసరా మహోత్సవాలలో భక్తులకు ఎటువంటి లోపం లేకుండా చూసుకోండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం సాయంత్రం దసరా మహోత్సవాలకు చేయవలసిన ఏర్పాట్లకు, పద్మావతి ఘాట్, కృష్ణవేణి ఘాట్, సీతమ్మ పాదాలు, పున్నమి ఘాట్, భవాని ఘాట్, గిరి ప్రదక్షిణ ప్రాంతము పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శరన్నవరాత్రులకు విజయవాడ నగరపాలక సంస్థ వారు ఏర్పాటు చేయవలసిన క్లోరక్ రూమ్, తాత్కాలిక మరుగుదొడ్లు, త్రాగునీరూ, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. క్లాక్ రూమ్ ఎక్కడెక్కడ పెడుతున్నారు తాత్కాలిక మరుగుదొడ్లు ఎక్కడ ఉండబోతున్నాయి, వాటి నిర్వహణ, ప్రజలకు త్రాగునీటి సౌకర్యం ఎక్కడెక్కడ కల్పిస్తున్నారు భవాని భక్తుల రెడ్ క్లాత్ కొరకు ఏర్పాటు చేయవలసిన కన్వీనర్ బెల్ట్ తదితర అంశాలపై అధికారులతో మాట్లాడి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి సౌకర్యార్థం 9 ప్రాంతాలలో 150 తాత్కాలిక మరుగుదొడ్లు , 6 క్లార్క్ రూమస్, 25 ప్రాంతాలలో త్రాగున్నీరు ఏర్పాటు, 1100 పారిశుధ్య కార్మికులతో పారిశుధ్య నిర్వహణ, విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పాటు చేస్తూ భక్తులకు ఎటువంటి లోపం లేకుండా చూసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *