విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మరి స్టెల్లా కళాశాల లో ప్రపంచ నదుల దినోత్సవం సందర్భం గా NCC 8 ఆంధ్ర నేవల్ యూనిట్ ఆధ్వర్యం లో నదుల పరిశుభ్రత మరియు పరిరక్షణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సబ్ .లెట్నెంట్ స్వప్న కేడేట్లు నదులు వాటి పరివాహక ప్రాంతాల పరి రక్షణ లో తాము భాగస్వాములం అవుతామని,ప్లాస్టిక్ వస్తువులను వినియోగించమని, పర్యావరణం పరిరక్షణ నది జలాల పరిరక్షణ లో భాగస్వామలుఆవుతమనే, చేతి సంచులు క్లాత్ బ్యాగ్స్ వడతమని ప్రతిజ్ఞ చేయించారు. క్యాదెట్లు పున్నమి ఘాట్ వద్ద పరిసరాలను శుభ్రం చేసారు. ప్లాస్టిక్ చెత్త మరియు పేపర్లు, బాటిల్స్ వేరు చేసి పరిసరాలను పరిశుభ్రం చేసారు. ఈ కార్య్రమంలో యన్. సి. సీ. అధికారి వికేశ్ తివారీ ,బి.వేంకటేశ్వర రావు మారిస్ స్టెల్లా కళాశాల, పి.బి సిద్దార్థ కళాశాల, ఆంధ్ర లయోల కళాశాల యన్ సి సి కేడెట్లు ఏపీ యస్.ఆర్.మున్సిపల్ స్కూల్ కెడెట్లు 51మంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News