Breaking News

ఇది మంచి ప్రభుత్వం… ప్రజల ముంగిటకు ప్రభుత్వం : జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

-కూటమి ప్రభుత్వంలో ఆదర్శ వంతమైన పాలన అందిస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి: ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి
-ఇది మంచి ప్రభుత్వం.. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడిన ప్రజా ప్రభుత్వం: సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ

సూళ్లూరుపేట మండలం, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
ఇది మంచి ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని, ప్రజల ముంగిటకు ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు వచ్చి గౌ. ముఖ్యమంత్రి ఇచ్చిన స్పూర్తి, ఆదేశాల మేరకు ప్రజలతో మమేకమై వారికి ప్రభుత్వం 100 రోజుల్లో సాధించిన విజయాలు వివరించి, చేయబోతున్న కార్యక్రమాలు వివరించి,వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ మరియు సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయ శ్రీ, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి సంయుక్తంగా పేర్కొన్నారు.

మంగళవారం సాయంత్రం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం కోట పోలూరు గ్రామం నందు ఇది మంచి ప్రభుత్వం అనే బృహత్తర కార్యక్రమం ప్రజావేదికను స్థానిక ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ, కోట పోలూరు సర్పంచ్ తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే తనను కలిసినప్పుడు నియోజక వర్గ సమస్యలు తన దృష్టికి తెచ్చేవారు అని, పులికాట్ సమీపంలో రోడ్డు అభివృద్ధి, ఇరకం దీవి సమస్యలు, కోరిడి పేరినాడు రోడ్డు అడిగారని వాటిపై చర్యలు తీసుకుంటామని, అలాగే ఫ్లెమింగో ఫెస్టివల్ జరిపేందుకు చర్యలు తీసుకుంటామని, శ్రీసిటీ వారి సహకారం కూడా కోరామని తెలిపారు. ఈ నియోజక వర్గంలో పరిశ్రమలు అందుబాటులో ఉన్నాయని, పరిశ్రమలు వస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని తెలిపారు. అనుమతిలేని అధునాతన బోట్ల ద్వారా సముద్రంలో పొరుగు రాష్ట్రం వారు మన జలాల్లో చేపల వేట సమస్యపై దృష్టి సారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పులికాట్ అభయారణ్యం సంరక్షణ తో పక్షులు, పర్యావరణం సంరక్షణకు చర్యలు, పూడి రాయి దరువు పులికాట్ మౌత్ ఓపెనింగ్ వద్ద పూడిక తీతకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్రాగు నీరు ప్రతి ఇంటికి అందేలా ప్రణాళికా బద్ధంగా జల్ జీవన్ మిషన్ కింద చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీలో ఇసుకను, మట్టిని ఎద్దుల బండి, ట్రాక్టర్ లో వారి స్వంత ఇంటి నిర్మాణాలకు తోలుకునెకి ఎలాంటి ఇబ్బందీ పెట్టరాదని అధికారులకు సూచించారు. తెలుగు గంగ నీరు స్వర్ణ ముఖి నుండి ఇస్తే బోర్లు రీఛార్జ్ అయ్యి, త్రాగు నీటి సమస్య పరిష్కారం ఐతుందని ప్రజల కోరిక మేరకు అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నూతన ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని అన్నారు. సచివాలయం సిబ్బంది ఇంటింటికి వచ్చి కొంత సమయం కేటాయించి మన ప్రభుత్వం 100 రోజుల్లో చేపట్టిన పనులను, ఇచ్చిన హామీలలో నెరవేర్చిన వాటిని తెలుపుతూ, రానున్న కాలంలో చేపట్టే కార్యక్రమాలను తెలపడం జరుగుతుందని తెలిపారు. మన నూతన ప్రభుత్వ ఏర్పాటు అయిన తర్వాత మన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రాష్ట్రమంతటా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి గ్రామ అభివృద్ది ప్రణాలికలు తయారు చేయడం జరిగిందని తెలిపారు. మన ముఖ్యమంత్రి ఇప్పుడు మండల, నియోజక వర్గ, జిల్లా విజన్ డాక్యుమెంట్ 2047 తయారీలో ప్రజల భాగస్వామ్యంతో ఆచరణాత్మకంగా ఉండేలా రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నమని అన్నారు. ప్రజల ఫీడ్ బ్యాక్ ఇందులో పరిగణలోకి తీసుకునేందుకు క్యూ ఆర్ కోడ్ అందుబాటులో ఉంచి గొప్ప విజన్ డాక్యుమెంట్ స్వర్ణాంధ్ర 2047 తయారీ చేపట్టనున్నారని అన్నారు. మన రాష్ట్రంలో ఇస్తున్నంత పెద్ద మొత్తంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు దేశంలో ఎక్కడ కూడా ఇవ్వడం లేదని అన్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను పలు కేటగిరీల కింద పేదలకు ప్రతి నెల ఒకటో తేదీన ఉదయాన్నే 6 గంటల నుండి సచివాలయ సిబ్బంది ద్వారా అందించడం జరుగుతోందని, ఈ నెల ఒకటో తేదీన ఇవ్వాల్సిన పింఛన్లను ఆదివారం ఉందని ఒక రోజు ముందుగానే ఆగస్ట్ 31 ననే అందించి గొప్ప మనసు కలిగిన ప్రజా పాలకుడిగా ఆదర్శంగా మన ముఖ్యమంత్రి నిలిచారని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా పెన్షన్లు పెంచారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే పలు హామీలు ముఖ్యమంత్రి నెరవేర్చారని అన్నారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ “ఇది మంచి ప్రభుత్వం” అనే కార్యక్రమం ప్రజల ముంగిటకు సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు వెళ్లి 100 రోజుల్లో ప్రభుత్వం చేసిన మేలును అమలు చేసిన హామీలు వివరిస్తున్నారు అని అన్నారు. ముఖ్యమంత్రి పలు హామీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయడం ప్రారంభించి అండగా నిలుస్తున్నారని, మెగా డిఎస్సీ విడుదల నిరుద్యోగ యువతకు భరోసా అని, ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్ ల పునరుద్ధరణ, ఒకటో తేదీననే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్న ప్రభుత్వం అని, వచ్చే దీపావళికి మహిళకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం ఇవ్వనున్నారని, త్వరలోనే తల్లికి వందనం అమలు చేస్తున్నారని అన్నారు. తాను నియోజక వర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని తెలిపారు. మండలానికి 2 కోట్లు వంతున నియోజక వర్గానికి 12 కోట్లు నిధులు వచ్చాయని తెలిపారు.

ఎంఎల్సి వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి పోయినా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాము ఇచ్చిన హామీల అమలకు కృషి చేస్తూ వంద రోజుల పాలనలో పలు హామీలు నెరవేర్చారు అని, మరిన్ని హామీలు రానున్న రోజుల్లో అమలు చేసే గొప్ప ఆదర్శ వంతమైన ముఖ్యమంత్రి అని కొనియాడారు.

పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రజలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చాలా మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారని ఇది మంచి ప్రభుత్వం అని కొనియాడారు. అనంతరం ప్రజల నుండి ప్రజా వేదికలో కలెక్టర్, ఎమ్మెల్యే అర్జీలు తీసుకున్నారు.

కార్యక్రమ అనంతరం కలెక్టర్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు కలిసి పొలం పిలుస్తోంది కార్యక్రమం కింద కౌలు రైతులకు సి సి ఆర్ సి కార్డులు పంపిణీ చేశారు. ప్రజా వేదికలో ప్రజల నుండి అర్జీలు తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరశ రత్నం, మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం, ఆర్డీఓ సూళ్లూరుపేట చంద్రముని, తాసిల్దార్ నరసింహ రావు, ఎంపిడిఓ మంజులమ్మ తదితర అధికారులు ప్రజా ప్రతినిధులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *