Breaking News

న్యూయార్కులో వివిధ సంస్థల ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ

-రైతుల సంక్షేమం, వాతావరణ మార్పుల అంశాలపై విస్తృత చర్చ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎపి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమెరికాలోని న్యూ యార్కులో పలుదేశాలకు చెందిన వాణిజ్య, ఎన్జీవో సంస్థలకు (యుకె, ఆస్ట్రేలియా, అమెజాన్ ఫారెస్ట్ మొదలైనవి) చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యారు. జనరల్ అట్లాంటిక్ ఫౌండేషన్ ప్రతినిధి కారా బార్నెట్ , ములగో ఫౌండేషన్స్ సి.ఇ.ఓ. కెవిన్ స్టర్, మరియు బియాండ్ నెట్ జీరో చైర్మెన్ లార్డ్ జాన్ బ్రౌన్ తదితరులతో చర్చలు జరిపారు. వివిధ వాణిజ్య, పెట్టుబడి అవకాశాల గురించి వారి మధ్య చర్చ సాగింది. రైతుల సంక్షేమం మరియు వాతావరణ మార్పుల నియంత్రణ కార్యకలాపాల కోసం ఆంధ్ర ప్రదేశ్ లో చేపట్టాల్సిన కార్యాచరణ గురించి వారు ప్రధానంగా చర్చించారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్గధామం అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి మెరుగైన ఫలితాలు సాధించే దిశగా సాగుతుందని, ఈ దశలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మెరుగైన ఆదాయాన్ని, అభివృద్ధిని సాధించవచ్చని ఆయా సంస్థల ప్రతినిధులకు మంత్రి తెలియజేశారు. మంత్రి విజ్ఞప్తిపై వివిధ సంస్థల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *