Breaking News

చారిత్రాత్మక ప్రదేశాలలో స్వచ్ఛత హి సేవ

-స్వచ్ఛ్ విజయవాడ ప్రజల సహకారం, భాగస్వామ్యం తో సాధ్యం
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పేరు ప్రఖ్యాతులు పెరగాలంటే చారిత్రాత్మిక ప్రదేశాలలో స్వచ్ఛత ఎంతో ముఖ్యమైనదని స్వచ్ఛత హి సేవ నిజమైన అర్థం అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా చారిత్రాత్మక ప్రదేశమైన గాంధీ కొండా లో శ్రమదానంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు జరిగే స్వచ్ఛత కార్యక్రమంలో గురువారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ వారు గాంధీకొండా మరియు మొగల్రాజ్ పురం లో ఉన్న గుహలలో ఉన్న వ్యర్థాలను శ్రమదానం ద్వారా పరిశుభ్రపరిచారని, ప్రతిరోజు విజయవాడ నగరపాలక సంస్థ వినూత్నంగా స్వచ్ఛతలో కార్యక్రమాలు చేపడుతోందని, అందులో ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారని, స్వచ్ఛ విజయవాడ కేవలం ప్రజల భాగ్యస్వామ్యంతోనే సాధ్యమని, అందుకు ప్రజల సహకారం అందుతున్నందుకు చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు.

300 అడుగుల పొడవైన జాతీయ జెండాను పట్టుకొని గాంధీ కొండా కింద నుండి పైకి ర్యాలీ ద్వారా అక్కడున్న ప్రజలకు ప్లాస్టిక్ నిషేధం, పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛభారత్ పై 200 విద్యార్థినీ విద్యార్థులు,సర్కిల్ 1,2 నుండి 200, మొత్తం 400 మంది ఉత్సాహంగా పాల్గొని సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం, పరిసరాల పరిశుభ్రత, రెడ్యూస్డ్ రీ యూస్ రీసైకిల్, స్వచ్ఛభారత్, నినాదాలతో అక్కడున్న ప్రజలకు అవగాహన కల్పించారు

ప్రజల భాగస్వాముతో స్వచ్ఛత హి సేవలో భాగంగా గాంధీ కొండను మొగల్రాజపురం గుహలను పరిశుభ్రత చేస్తున్న వేళ గాంధీ కొండలో పరిశుభ్రం చేయడానికి వచ్చిన విద్యార్థినీ విద్యార్థులకు వారికీ పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడానికి బుర్రకథ చెప్పే బృందంతో వారికి అర్థమయ్యే రీతిలో స్వచ్ఛతను వివరించారు. తదుపరి విద్యార్థినీ విద్యార్థులు సర్కిల్ వన్ కార్యాలయం సిబ్బంది విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అందరూ గాంధీ కొండ లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఇతర వ్యర్థాలను, గడ్డిని కలుప మొక్కల్ని, స్వయంగా స్వచ్ఛత హి సేవ అంటూ పరిశుభ్రపరిచారు. ఇందులో భాగంగా మొగల్రాజపురం గుహలోను సర్కిల్ 3 కార్యాలయంలో ఉన్న కార్పొరేషన్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని అక్కడున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు , ఇతర వ్యర్ధాలు కలుప మొక్కలు, గడ్డిని మొత్తం పరిశుభ్రపరచారు.

ఈ కార్యక్రమంలో విజయవాడ నగర పలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తో పాటు అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) కే.వి.సత్యవతి,చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నావళి, జోనల్ కమిషనర్లు రమ్య కీర్తన, ప్రభుదాస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు, డాక్టర్ సురేష్ బాబు, డాక్టర్ బాబు శ్రీనివాస్, ఎస్టేట్ ఆఫీసర్ టి శ్రీనివాస్, సర్కిల్ వన్ కార్పొరేషన్ సిబ్బంది, గాంధీజీ మున్సిపల్ హై స్కూల్, పాదుర్తి సుందరమ్మ హై స్కూల్, మహమ్మద్ అలీ పురం వించ్పేట్ ఉర్దూ హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *