తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ ము నందలి జిల్లా కుష్టు ఎయిడ్స్ మరియు క్షయ నివారణ కార్యాలయము నందు గురువారం జిల్లా లోని డిప్యూటి పారా మెడికల్ అధికారులు మరియు లెప్రసి నోడల్ అధికారులకు మాసపు సమీక్షా సమావేశము నిర్వహించ బడినది. ఈ కార్యక్రమమునకు ముఖ్య అదిథి గా విచ్చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ U. శ్రీ హరి ప్రసంగిస్తూ కుష్టు వ్యాధి పై క్షేత్ర స్థాయి లో సమగ్రముగా సర్వే నిర్వహించాలని తెలియజేసారు. ఈ సంవత్సరము జూలై 18 నుండి ఆగస్ట్ 10 వరకు జిల్లా లో జరిగిన కుష్టు వ్యాధి సర్వే లో ప్రతిభ ప్రదర్శించిన డిపి ఎమ్ఓలు మరియు నోడల్ పర్సన్ లకు మొమెంటోలు సర్టిఫికెట్స్ ప్రధానం చేసారు. జిల్లా కుష్టు మరియు క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీనివాసుల రెడ్డి గారు ప్రసంగిస్తూ శరీరంపై స్పర్శ లేని మచ్చలు,పొడలు లావుగా మారిన నొప్పితో కూడిన నరాలు,బొడిపెలు నొప్పిలేని పుండ్లు,చెవి తమ్మెలు మందంగా మారి ఉండడం మొదలైన లక్షణాలు ఉన్నట్లయితే కుష్ఠు వ్యాధి లక్షణాలుగా అనుమానించాలని వ్యాధి నిర్ధారణ కొరకు దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల్ని సంప్రదించాలని తెలిపారు.కుష్ఠువ్యాధిగా నిర్ధారణ జరిగితే ఖరీదైన మందులు మరియు శస్త్ర చికిత్సలు ఉచితంగా అందించడం జరుగుతుంది అని పేర్కొన్నారు.కుష్ఠు వ్యాధిగ్రస్థులకు ఉచితంగా ఎంసీఆర్ చెప్పులు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమం లో జిల్లా మలేరియా అధికారి రూప్ కుమార్, ఫిజియో థెరపిస్ట్ వెంకట రమణ, జిల్లా లోని డిపి ఎమ్ఓలు, లెప్రసి నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News