Breaking News

APGENCO మరియు NHPC ల సంయుక్త భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌ను పునరుత్పాదక శక్తి రంగంలో అగ్రస్తానంలో నిలపడానికి ఒప్పందం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
APGENCO (Andhra Pradesh Power Generation Corporation Limited) మరియు NHPC (National Hydro Electric) ల సంయుక్త బాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌ను పునరుత్పాదక శక్తి రంగంలో అగ్ర స్థానంలో నిలిపేందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమానికి ఎనర్జీ మినిస్టర్ గొట్టిపాటి రవి కుమార్, ఎనర్జీ సెక్రటరీ కె. విజయానంద్, APGENCO మేనేజింగ్ డైరెక్టర్ కె.వి.ఎన్ చక్రధర్ బాబు, మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ ఒప్పందం ద్వారా APGENCO ప్రస్తుతమున్న 8,800 MW సామర్ధ్యానికి అదనంగా 8,560 MW సామర్ధ్యాన్ని పెంచుకోవడం, NHPC కి ప్రస్తుతమున్న 7100 MW సామర్ధ్యానికి అదనంగా 4,600 MW పెంచుకుంటూ దేశంలోని వివిధ రకాల ప్రాజెక్టులకు పునరుత్పాదక శక్తిని అందించే క్రమంలో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. దీని వలన ఆంధ్రప్రదేశ్ రెన్యూవబుల్ ఎనర్జీ అభివృద్ధిలో ఉండటమే కాకుండా సొలర్, విండ్, మరియు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు భారత ప్రభుత్వ ప్రోత్సాహo అందుతుంది. దీనితో పాటు NREDCAP 39,000 మెగావాట్ల మిశ్రమ సామర్థ్యంతో 36 పంప్డ్ నిల్వ ప్రాజెక్టులకు ఉపయోగపడే 36 ప్రదేశాలను గుర్తించి పునరుత్పాదక శక్తి అభివృద్ధికి కృషి చేస్తుంది . APGENCO దాని కొత్త పంప్డ్ నిల్వ ప్రాజెక్టుల కోసం 6,020 మెగావాట్ల సామర్థ్యంతో 11,200 మెగావాట్ల సౌర విద్యుత్ కర్మాగారాలను ఏర్పాటు చేయడం ద్వారా సాహసోపేతమైన దిశ తీసుకోవడంతో పాటు, ప్రస్తుత విద్యుత్ కర్మాగారం ఆవరణలో ఉన్న ఖాళీ భూమిలో, APTRANSCO సబ్‌స్టేషన్‌లలో 150 మెగావాట్ల సౌర విద్యుత్ కర్మాగారాలను ఏర్పాటు చేస్తోంది. APGENCO మరియు NHPC మధ్య భాగస్వామ్యం ఐదు పంప్డ్ నిల్వ ప్రాజెక్టులలో 5,070 మెగావాట్ల అభివృద్ధిని, వివిధ దశలలో 5 సంవత్సరాలలో పని ప్రారంభించడం కొరకు అంచనావేయడం జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ లక్ష్య సాధనలో APGENCO మరియు NHPC ల యొక్క కృషిని పొగిడారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రానికి భవిష్యత్ భద్రత మరియు మరింత దేశం మొత్తపు పునరుత్పాదక శక్తి లక్ష్యాలను అబివృద్ది చేసే దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు. ఎనర్జీ మినిస్టర్ గొట్టిపటి రవీకుమార్ మాట్లాడుతూ ఈ ఒప్పందం ఏపీ భవిష్యత్తును భద్రపరిచే ఒక గొప్ప మార్గదర్సకమని అభినందించారు.

ఈ సందర్భంగా కె. విజయానంద్ ఎనర్జీ సెక్రటరీ, మాట్లాడుతూ APGENCO మరియు NHPC మధ్య జరిగే భాగస్వామ్యం, ఇతర రాష్ట్రాలకు ఒక మోడల్‌గా పనిచేస్తుంది, ప్రాంతీయ మరియు జాతీయ శక్తి అవసరాలను సుస్థిరంగా తీర్చడానికి సహాయపడుతుంది అని అన్నారు.

కె.వి.ఎన్. చక్రధర్ బాబు, APGENCO మేనేజింగ్ డైరెక్టర్, వారి సంస్థ పునరుత్పాదక శక్తి రంగంలో అర్థవంతమైన సహకారం అందించగలదని విశ్వసిస్తున్నానని, ప్రధాన ప్రాజెక్టులు అయిన అప్పర్ సిలేరు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు (1,350 MW) మరియు కమలాపాడు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు (950 MW) లు వేగంగా ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి అని తెలిపారు.

NHPC CMD మాట్లాడుతూ APGENCO తో కలిసి పని చేయడం వలన వారి సంస్థ పునరుత్పాదక శక్తిని వివిధ రకాలుగా అభివృద్ధి చేయడానికి సహాయపడుతుందని, ఇది ఆంధ్ర ప్రదేశ్‌ను భారతదేశంలో పునరుత్పాదక శక్తి ఉద్యమంలో ముందువరసిన రాష్ట్రంగా చేస్తుంది అని, ఈ ఒప్పందం తో , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మరియు దేశం సుస్థిర మరియు శక్తి భద్రత భవిష్యత్త కోసం లక్ష్యాలను సాధించడానికి దారి తీస్తుంది అని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *