Breaking News

తెలుగువారి ఆత్మగౌరవం పద్మ విభూషణ్ ప్రొఫెసర్ కొత్త సచ్చిదానందమూర్తి

-ఆయన పేరుతో రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహణ
-ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్
-రెవెన్యూ సివిల్ సప్లై మంత్రులు సత్య ప్రసాద్, నాదెండ్ల మనోహర్ రాక
-వర్సిటీ ముస్తాబు ఏర్పాట్లు ముమ్మరం
-విలేకరుల సమావేశంలో ఉప కులపతి ఆచార్య కే గంగాధరరావు వెల్లడి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పద్మ విభూషణ్ ప్రొఫెసర్ కొత్త సచ్చిదానందమూర్తి ప్రపంచ తత్వవేత్తల్లో ఒకరుగా నిలుస్తారని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కే గంగాధర రావు పేర్కొన్నారు. సచ్చిదానందమూర్తి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ సచ్చిదానందమూర్తి సెంటర్ ఫర్ ఆఫ్రో ఏషియన్ ఫిలాసఫీస్, ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. శనివారం ఆయన చాంబర్లో జరిగిన విలేకరుల సమావేశంలో సదస్సుకు సంబంధించిన వివరాలను వీసీ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తత్వశాస్త్రంలో తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా ఆయన నిలుస్తారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని సంఘం జాగర్లమూడి ప్రాంతానికి చెందిన కొత్త సచ్చిదానందమూర్తి సాధారణ ప్రొఫెసర్ స్థాయి నుంచి యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ వైస్ చైర్మన్ గా ఎదగడం తెలుగువారికి గర్వకారణం అని పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు అందని ద్రాక్షగా ఉన్న యూజీసీ వైస్ చైర్మన్ హోదాను ఆ రోజుల్లోనే అధిరోహించిన ఘనత ఈయనకు దక్కుతుందని పేర్కొన్నారు. విద్యావేత్తగా తత్వశాస్త్రాన్ని ప్రపంచానికి తెలియజేసిన తెలుగువానిగా తన గొప్పతనాన్ని చాటారన్నారు. సచ్చిదానందమూర్తి రచనలు నేటి ఆధునిక జీవన స్థితిగతులకు మార్గదర్శకాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఆయన తెలుగుజాతి గర్వించేలా ఎదిగారని ఆయన జన్మించి శత వసంతాలైన సందర్భంగా ఆయనను గౌరవించుకోవడం యూనివర్సిటీ బాధ్యతగా పేర్కొన్నారు . ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం యూనివర్సిటీ గా ఏర్పడక ముందు నల్లపాడు లో ఏర్పాటుచేసిన పీజీ సెంటర్ కు ఆయన స్పెషల్ ఆఫీసర్ గా పనిచేశారని పేర్కొన్నారు.

రెండు రోజుల జాతీయ సదస్సు
ప్రొఫెసర్ కొత్త సచ్చిదానందమూర్తి గొప్పతనాన్ని చాటేందుకు ఆయన రచనలను నేటి తరానికి పరిచయం చేసేందుకు సోమ, మంగళవారాల్లో రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. *పద్మ విభూషణ్ ప్రొఫెసర్ కొత్త సచ్చిదానందమూర్తి విజన్ ఆన్ ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిఫ్లెక్షన్స్ ఆన్ 21వ సెంచరీ ఎడ్యుకేషనల్ పాలసీ అండ్ ప్లానింగ్ ఇన్ ఇండియా అనే అంశంపై సదస్సును ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ సదస్సుకు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. అలాగే రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ, ఐటి, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజి మంత్రి నారా లోకేష్, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, అవనిగడ్డ, పొన్నూరు శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, యూపీఎస్సీ పూర్వ సభ్యులు ప్రొఫెసర్ కె. ఎస్. చలం పాల్గొంటారని పేర్కొన్నారు. సదస్సులో న్యూఢిల్లీలోని ఢిల్లీ యూనివర్సిటీ ఫిలాసఫీ విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ అశోక్ వోహ్రా కీలక ఉపన్యాసం ఇస్తారని వీసి వెల్లడించారు. సదస్సుకు గౌరవ అతిథులుగా రెక్టర్ ఆచార్య కే రత్న షీలా మణి, రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం హాజరవుతారని వివరించారు. ఆచార యం .త్రిమూర్తి రావు కన్వీనర్ గా నిర్వహిస్తున్న ఈ జాతీయ సదస్సు కు దేశ నలుమూలల నుంచి మేధావులు , ఉన్నత విద్యావంతులు హాజరవుతారని తెలిపారు . రెక్టార్ ప్రొఫెసర్ కె. రత్నషీలామణి మాట్లాడుతూ రెండు రోజులు ఈ సదస్సుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సచ్చిదానందమూర్తి తత్వశాస్త్రాన్ని నేటి తరానికి తెలియజేసే ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రిజిస్ట్రార్ ఆచార్య జి .సింహాచలం మాట్లాడుతూ రెండు రోజుల జాతీయ సదస్సు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని ఈ మేరకు వర్సిటీని ముస్తాబు చేస్తున్నట్లు వివరించారు. రెండు రోజుల జాతీయ సదస్సులో పలు అకడమిక్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ ఎం. త్రిమూర్తి రావు, మీడియా కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ జి .చెన్నారెడ్డి, ప్రొఫెసర్ యం .మురళీమోహన్, డాక్టర్ కే. జ్యోతిర్మయి, డాక్టర్ జై మధుబాబు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *