-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 15 ఫిర్యాదులు అందినట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ వచ్చిన ప్రతి ఫిర్యాదును ఖచ్చితంగా పరిష్కరించేటట్టు చూసుకోవాలని అవసరమైతే ఇతర శాఖల సమన్వయంతో సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయం స్థాయిలో ప్రతి సచివాలయంలో సెక్రెటరీ సెలవు పెట్టిన, ఇన్చార్జి సెక్రటరీ ఏర్పాటు చేసి, ప్రజలు తీసుకొచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించేటట్టు చర్యలు తీసుకొని సచివాలయం స్థాయిలో కూడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో దరఖాస్తు చేస్తూ, సంతృప్తికరమైన పరిష్కారం ఇచ్చిన తర్వాతే ఆ ఫిర్యాదును ఆన్లైన్లో క్లోజ్ చేస్తున్నామని తెలిపారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అనధికార ఆక్రమణలు, డ్వాక్రా సంఘాల సమస్య, రోడ్డు, డ్రైనేజీ సమస్యలపై ఫిర్యాదులు అందుకని సత్వర, సంతృప్తికరమైన పరిష్కారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అత్యధికంగా పట్టణ ప్రణాళిక కు 10, ఇంజినీరింగ్ 3, రెవెన్యూ, యు సి డి సంబంధిత ఒక్క ఫిర్యాదు అందుకున్నారు. మొత్తంగా ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లో 15 ఫిర్యాదులు అధికారులు స్వీకరించారు.
Prajavartha Online Telugu News